• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘జిల్లాలో అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనే లక్ష్యం’

BPT: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన ధ్యేయంగా బాపట్ల పోలీసులు ప్రత్యేక నిఘా సారించారు. జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ (IPS) పర్యవేక్షణలో మంగళవారం పలు జూద స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. రహస్య సమాచారం మేరకు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ రైడ్లలో పలువురు జూదగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

April 14, 2026 / 06:42 PM IST

డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ

ATP: శింగనమల నియోజకవర్గంలో పీఎంఏజేఏవై పథకం కింద డ్వాక్రా సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీలేఖ రూ.34 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. బుక్కరాయసముద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి నుంచి ఆలం నరసనాయుడు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

April 14, 2026 / 06:15 PM IST

సోలార్ రూఫ్‌టాప్ యూనిట్ల ప్రారంభం

ప్రకాశం: పెరుగుతున్న విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రజలు సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ముక్తినూతలపాడు కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో ఈ పథకం అమలుకు రూ.31.18 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

April 14, 2026 / 06:13 PM IST

మురుగునీటి సమస్య పరిష్కరించిన అధికారులు

ELR: ఉంగుటూరు మండలం ఏ. గోకవరంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో నిలిచిపోయిన మురుగునీటి సమస్యకు అధికారులు మంగళవారం పరిష్కరించారు. మురుగు కాలువలకు కొందరు అడ్డుకట్ట వేయడంతో ఇళ్ల మధ్య నీరు నిలిచి దుర్వాసన వస్తోందని స్థానికులు MLA ధర్మరాజుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో MPDO మనోజ్ రంగంలోకి దిగి అడ్డుకట్టలను తొలగింపజేశారు.

April 14, 2026 / 06:11 PM IST

ఇంటూరులో PM సూర్యఘర్ పథకం ప్రారంభం

BPT: అమృతలూరు మండలం ఇంటూరు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా PM సూర్యఘర్ SC/ST పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరై రిబ్బన్ కట్ చేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 14, 2026 / 06:08 PM IST

‘మోడల్ పోలీస్ స్టేషనుగా తీర్చిదిద్దాలి’

VZM: విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌తో పాటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ను SP దామోదర్ ఇవాళ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, విభాగాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను మోడల్ పోలీస్ స్టేషనుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

April 14, 2026 / 06:08 PM IST

సీతానగరంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

E.G: సీతానగరం మండలంలోని చిన్నకొండేపూడి, సింగవరం, వంగలపూడి, రామచంద్రపురం గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతానగరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి, అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు పాల్గొన్నారు.

April 14, 2026 / 06:02 PM IST

ఎంపీకి మత్స్యకార సంఘం నేతలు వినతి పత్రం అందజేత

NLR: తమ సమస్యలు పరిష్కరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మత్స్యకార సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. మంగళవారం డీపీఆర్ నివాసంలో ఆయనను కలిశారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల బోట్లు సరిహద్దుల్లోకి రాకుండా ప్రభుత్వం ఇరువు రాష్ట్రాలతో చర్చలు జరపాలన్నారు. మత్స్యకారులకు 50 బోట్లు కొనుగోలుకు 20 శాతం సబ్సిడీ కల్పించాలన్నారు.

April 14, 2026 / 06:00 PM IST

నర్సిపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కోనసీమ: ఆలమూరు మండలం నర్సిపూడి పీఏసీఎస్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు రాయుడు వెంకటస్వామి  ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ఈ కేంద్రం ద్వారా రైతులు తమకు పంటకు మద్దతు ధర పొందచ్చన్నారు.

April 14, 2026 / 06:00 PM IST

‘జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం’

SKLM: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు కలెక్టర్‌‌ను ఆదేశించారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో IFWJ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించగా, మంత్రి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో చర్చించి సమస్యను పరిష్కరిస్తానన్నారు.

April 14, 2026 / 06:00 PM IST

దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభం

GNTR: దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అమరావతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీతో పాటు, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ఆవిష్కరించారు.

April 14, 2026 / 05:50 PM IST

టాస్క్ ఫోర్స్ తనిఖీలు.. గంజాయి స్వాధీనం

ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆరు కిలోల గంజాయి మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న గంజ్జాయిని పట్టుకున్నారు. అనంతరం కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 14, 2026 / 05:42 PM IST

గొల్లపల్లి ప్రీమియర్ లీగ్ విజేత భగత్ సింగ్ టీం

CTR: శాంతిపురం(M) గొల్లపల్లిలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ‘గొల్లపల్లి ప్రీమియర్ లీగ్’ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో అమిగోస్- 11 టీంపై భగత్ సింగ్- 11 టీం ఘన విజయం సాధించింది. అనంతరం విజేతలకు గ్రామస్థులు బహుమతులు ప్రదానం చేశారు. క్రీడల ద్వారా ఐక్యతను చాటడమే ఈ టోర్నీ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

April 14, 2026 / 05:36 PM IST

బల్లికురవలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

BPT: బల్లికురవ మండలంలోని కుమ్మినేనివారిపాలెం గ్రామంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర సరఫరాల సంస్థ ద్వారా వరి మద్దతు ధరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రబి సీజన్‌లో పండించిన వరిని రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారు. సాధారణ రకం వరికి రూ.2369, ఏ-గ్రేడ్ వరికి రూ.2389 మద్దతు ధరను నిర్ణయించారు.

April 14, 2026 / 05:34 PM IST

ఎస్సీ, ఎస్టీ గృహాలకు ‘సౌర’ వెలుగులు

VSP: పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా చినవాల్తేరులో ఒక గృహంపై ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ…. 3,595 మందికి 7.19 మెగావాట్ల ప్లాంట్లు కేటాయించామని తెలిపారు.

April 14, 2026 / 05:34 PM IST