PLD: పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా పేదల ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులు నింపుతున్నామని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. రొంపిచర్ల మండలంలో రూ.2.21 కోట్ల వ్యయంతో విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సుబ్బయ్య పాలెంలో 77 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ ప్యానెల్ ప్రారంభించారు.
KDP: బ్రహ్మంగారి మఠం దేవస్థానంలో తలనీలాల వేలం పాట గురువారం ఎండోమెంట్ ఆర్జేసీ (RJC) చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది. గతంలో కాంట్రాక్టర్ల సిండికేట్ కారణంగా మూడుసార్లు వేలం వాయిదా పడగా, నాలుగోసారి నిర్వహించిన ఈ వేలంలో అత్యధికంగా రూ. 87 లక్షలకు టెండర్ ఖరారైంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు శంకర బాలాజీ, శ్రీనివాసులు పాల్గొన్నారు.
AKP: నర్సీపట్నం వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయంలో నూతన సాంకేతికతపై శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. నూతన పద్ధతిలో నారు పెంపకం గురించి తెలియజేశారు. నారు పెంపకం 10 సెంట్లు చేసి 30 నుంచి 40 వేలు సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి శ్రీదేవి పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయం చుట్టుపక్కల ప్రాంతం రోజురోజుకు మురికితో నిండిపోతూ, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోంది. ప్రహరీ గోడ పక్కన చెత్త పారవేయడం వల్ల దుర్గంధం వ్యాపించి పాఠకులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చెత్త తొలగించి, భవిష్యత్తులో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
SKLM: వైసీపీ కుటుంబ సభ్యులు, మహిళలపై ఏబీఎన్ అధినేత ఈ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి అప్పలరాజు అన్నారు. గురువారం పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై సీఐ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీడియా నైతిక విలువలను పాటించాలని అన్నారు.
KRNL: ఆదోనిలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ రూఫ్‌లు ఏర్పాటు చేయాలని SFI నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇవాళ సమర్పించారు. ఎండ దెబ్బతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. బస్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.
కృష్ణా: ఉయ్యూరులో ఓ ప్రైవేట్ దంత వైద్యశాలలో దోపిడీ జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక పన్ను పీకటానికి రూ.3 వేలు వసూలు చేస్తుండగా, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మెడికల్ సేవల పేరుతో అధిక రుసుములు తీసుకుంటున్నప్పటికీ, రోగులకు సరైన సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NDL: డోన్ తారకరామనగర్ కాలనీలో బుజ్జికృష్ణకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ఇవాళ తెలిపారు. గేదెల పెంపకంతో జీవనం సాగించిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బ్యాంకు రుణాల భారం తగ్గించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.
NTR: నందిగామ మండలంలోని రుద్రవరం, గొళ్లమూడి గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను జాయింట్ కలెక్టర్ ఇలాకీయా పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్ల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రీ-సర్వే నిర్వహించి, ప్రత్యేక క్యూఆర్ కోడ్, రాజముద్రతో డిజిటల్ పాస్‌పుస్తకాలను రూపొందించి అందిస్తోందని తెలిపారు.
ప్రకాశం: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాల గురించి జగన్‌కు ఆయన వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. పార్టీ బలోపేతంపై కృషి చేయాలని రవి బాబుకు జగన్ సూచించారు.
అన్నమయ్య: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ‘యువగళం’ పుస్తకాన్ని అందజేసిన లోకేష్, రాష్ట్ర అభివృద్ధి మరియు యువత సాధికారతపై చర్చించారు. రవాణా సేవల మెరుగుదల, రోడ్డు భద్రత, క్రీడా అభివృద్ధిపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టీసీ బలోపేతం, సేవల విస్తరణపై కూడా చర్చించారు. మెరుగైన పాలన అందించాలనే దిశగా నిర్ణయించారు.
అన్నమయ్య: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ‘యువగళం’ పుస్తకాన్ని అందజేసిన లోకేష్, రాష్ట్ర అభివృద్ధి మరియు యువత సాధికారతపై చర్చించారు. రవాణా సేవల మెరుగుదల, రోడ్డు భద్రత, క్రీడా అభివృద్ధిపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టీసీ బలోపేతం, సేవల విస్తరణపై కూడా చర్చించారు. మెరుగైన పాలన అందించాలనే దిశగా నిర్ణయించారు.
BPT: యాజిల్ గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి భట్టిప్రోలు మండలంలో జరిగిన సీఎం సభలో కోటి రూపాయలు గ్రామ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు అందజేశారు. P4లో భాగంగా తమ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు తన వంతు సహాయం అందజేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు.
TPT: సత్యవేడు నియోజకవర్గంలో దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్‌ను కోరారు. గురువారం తిరుపతికి వచ్చిన ఛైర్మన్‌కు స్వాగతం పలికిన అనంతరం, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు జారీ చేసి దళితులకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు.
PLD: సత్తనపల్లి కట్టవారిపాలెంలో గురువారం కురిసిన వర్షం, పిడుగు పాటుకు ఓ రైతు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వ్యవసాయ కూలీ పంట పొలంలో మిరపకాయల కోస్తూ.. మొబైల్ ఫోన్లో మాట్లాడుతుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో సురేష్ అక్కడికక్కడే చనిపోయాడని మిర్చి కోతకు వచ్చిన స్థానికులు తెలిపారు.