• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన అత్యవసరం’

VSP: జీవీఎంసీ పరిధిలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన అత్యంత అవసరమని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

April 14, 2026 / 08:26 PM IST

రేపు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం

TPT: రేపు ఉదయం 9:30 గంటలకు వెంకటగిరి పట్టణంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. డక్కిలి, బాలయపల్లి, వెంకటగిరి రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

April 14, 2026 / 08:24 PM IST

ఈనెల 16 నుంచి ‘స్వీయ గణన’: కలెక్టర్

ATP: జనగణన-2027లో భాగంగా ఈనెల 16 నుంచి 30 వరకు జిల్లాలో ‘స్వీయ గణన’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 15 రోజుల పాటు వివిధ వర్గాలకు షెడ్యూల్ ఖరారు చేశారు. 16న ప్రజాప్రతినిధుల గణనతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు.

April 14, 2026 / 08:20 PM IST

కోర్టు విధుల్లో నిర్లక్ష్యం అసలు సహించము: ఎస్పీ

TPT: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష నిర్వహించారు. కేసుల వేగవంత పరిష్కారానికి పెండింగ్ కేసులు, NBWలను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. కోర్టు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయపాలన పాటిస్తూ, పోలీసు-న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయం పెంచి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

April 14, 2026 / 08:18 PM IST

ఉండిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

W.G: ఉండి పెదపేటలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉండి ఎస్సై మహమ్మద్ నజీరుల్లా అహ్మద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకుని పోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై శ్రీనివాసరావు, V. విజయ్ కుమార్, చిట్టూరి జోషి తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 08:15 PM IST

జనగణనను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

NDL: జనగణన 2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్-ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇవాళ జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. https://se.census.gov.in ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు.

April 14, 2026 / 08:14 PM IST

‘స్వీయ గణన విధానంపై అవగాహన కల్పించాలి’

AKP: జనగణన-2027లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. తొలిసారిగా ప్రజలే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ఏప్రిల్ 16 నుంచి 30 వరకు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల పౌరులు se.census.gov.in పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చునన్నారు.

April 14, 2026 / 08:13 PM IST

నీటి కష్టాలతో గిరిజన కుటుంబాల వేదన

ASR: అనంతగిరి మండలం గాదిల్లోవ గ్రామంలో గిరిజనులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 23 కుటుంబాలు మైళ్ల దూరం నడిచి నీరు తెచ్చుకుంటున్నారు. వర్షాకాలంలో బురద నీరు తాగాల్సి రావడంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

April 14, 2026 / 08:11 PM IST

అమరవీరులకు ఘన నివాళులు

PPM: పాలకొండ అగ్నిమాపక కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవర్ పరేడ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ అగ్నిమాపక అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 231 మంది అమరవీరులకు  నివాళులర్పించారు.

April 14, 2026 / 08:11 PM IST

‘కన్నీళ్లు తెప్పించిన అంబేద్కర్ సినిమా’

GNTR: తెనాలిలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రదర్శించిన అంబేద్కర్ సినిమా ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చిత్రాన్ని చూస్తూ పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, నటీనటులు పాల్గొన్నారు.

April 14, 2026 / 08:10 PM IST

వెలుగు వీఓఏలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వెలుగు సంఘాల సహాయకులు, వీఓఏలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న 51 మంది వీఓఏలకు ఎమ్మెల్యే, ఆకుల రామకృష్ణ చేతుల మీదుగా స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు.

April 14, 2026 / 08:00 PM IST

రేపే ఇంటర్ ఫలితాలు

KRNL: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను రేపు(బుధవారం) విడుదల చేయబోతున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. అందరికంటే ముందుగా HIT TV యాప్ లో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

April 14, 2026 / 07:52 PM IST

గుండెపోటుతో దళిత యువకుడు మృతి

NDL: చాగలమర్రి గ్రామం ఎస్సీ కాలనీలో ప్రవేట్ మీసేవ కేంద్రం నిర్వాహకుడు సుబ్బరాయుడు (35) గుండెపోటుతో మృతి చెందాడు. ఇవాళ అంబేద్కర్ జయంతి నాడు గుండెపోటుతో మరణించడంతో పలువురు దళిత నాయకులు, పలు పార్టీ నాయకులు సంతాపం తెలిపి నివాళులు అర్పించారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

April 14, 2026 / 07:45 PM IST

‘అంబేద్కర్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి’

VSP: డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నగర పోలీస్ కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత భాగ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వాతంత్రం కోసం ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు.

April 14, 2026 / 07:44 PM IST

ఎస్టీలకు ఇళ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే

NLR: ఉదయగిరి మండల పరిధిలోని బండగానిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామ ఎస్టీలకు ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ నివేశిత (ఇంటి) స్థలాలు పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. 32 మంది ఎస్టీలకు నివేశిత స్థలాల పట్టాలతో పాటు ఆయన ట్రస్టు ద్వారా మహిళ లబ్ధిదారులకు చీరలు అందజేశారు. అనంతరం బిజ్జంపల్లిలో రూ.46.80 లక్షలతో సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.

April 14, 2026 / 07:41 PM IST