NLR: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని బండగానిపల్లి గ్రామానికి చెందిన భేరి తిరుపాల్ రెడ్డి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో పోస్ట్ చేశారని అన్నారు.