BPT: ప్రజల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. కర్లపాలెం మండల పార్టీ కార్యాలయంలో గురువారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు సేకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.