BPT: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతోందని బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజశేఖర్ అన్నారు. బాపట్లలో సోమవారం మాట్లాడుతూ..రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినా సకాలంలో జీతాలు, పెన్షన్లు అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. వరదల పరిస్థితుల్లో కూడా ప్రాణనష్టం జరగకుండా చుశామన్నారు.