VSP: స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమంలో భాగంగా విశాఖ పోర్టు అథారిటీ పరిపాలనా భవనంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పోర్టు పరిపాలనాభవనం దక్షిణ భాగంలో సోమవారం 300 మొక్కలను పోర్టు అధికారులు నాటారు. ఇందులో ఏ.వి.ఎన్. కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.