కోనసీమ: రావులపాలెంలో శ్రీ సత్యసాయి సేవ కేంద్రం నందు మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటలు నుండి ఉచిత కంటి, ఆయుర్వేద వైద్యం శిబిరం, మధ్యాహ్నం మూడు గంటలు నుండి ఉచిత ఈఎన్టీ, ఎముకలు, కీళ్ళు, చిన్న పిల్లల వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని అన్నారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలన్నారు.