VSP: తగరపువలస మండలం చిట్టివలస జడ్పీ బాలుర హైస్కూల్ ఆవరణలో సోమవారం నుంచి మూడురోజుల పాటు మండలస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటలపోటీలు జరుగనున్నాయి. అండర్-14, 17 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా జరిగే ఈ పోటీలలో యోగా, కబడ్డీ, చెస్, ఖోఖో, బాడ్మింటన్, వాలీ బాల్, అథ్లెటిక్స్ నిర్వహించనున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.