VSP: ఆనందపురం హై స్కూల్ గ్రౌండ్లో సోమవారం నుంచి మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్.జి.ఎఫ్ మండల కో-ఆర్డినేటర్ వరప్రసాద్, పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు రామకృష్ణ పట్నాయక్ పేర్కొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, చెస్ వంటి ఆటల పోటీలు ఉంటాయన్నారు. ఎంపికైన విద్యార్థులను నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తామని తెలిపారు.