KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక అమ్మవారి శాల వద్ద గురువారం దీపావళి పురస్కరించుకుని ధనలక్ష్మి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేకువజాము నుంచి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి వివిధ రకాల పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.