ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలియజేశాడు. పెన్షన్ పెంచేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు విషయాలను చర్చించిన వారు.. పెన్షన్ విషయంలోనూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 2,500 ఉన్న పెన్షన్ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62.31 లక్షల మంది పెన్షన్దారులకు మేలు జరుగనుంది.
జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ను అమలు కానుంది.మరొకవైపు వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.