ఏలూరు బస్టాండ్ వద్ద చోరీకి గురైన 14 కాసుల బంగారు ఆభరణాల కేసును ఏలూరు త్రీ టౌన్ పోలీసులు ఛేదించారు. మచిలీపట్నానికి చెందిన మహిళ రాజమండ్రి నుంచి మచిలీపట్నం వెళ్ళే క్రమంలో ఏలూరులో బస్సు మారే క్రమంలో బ్యాగును అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితురాలని అరెస్టు చేసి 14 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.