ఓ గ్రామంలో వింత దృష్యాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఊళ్లో ఎక్కడ చూసిన పసుపు-కుంకుమ, అన్నం, మంత్రించిన నిమ్మకాయలు కనిపిస్తున్నాయి. దీంతో 15 రోజుల నుంచి గ్రామస్తుతు జాగారం చేస్తున్నారు.
Turmeric-saffron, enchanted lemons all over the village.. Villagers vigil for 15 days
Viral News: ఈ గ్రామంలో ఎక్కడ చూసిన మంత్రించిన నిమ్మకాయలు, చెట్లపై వేలాడుతూ, గడపల ముందు, తలుపులపై వేలాడే నిమ్మకాయలు. ఉదయం లేచే సరికి రోడ్ల మీద ఇంటి గుమ్మాల ముంగల ఎక్కడపడితే అక్కడ వెదజల్లిన అన్నం, పసుపు-కుంకుమ, డబ్బులు దర్శనం ఇస్తున్నాయి. పల్నాడు జిల్లా చిన్నతురకపాలెం ఊళ్లో ఈ భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటో తెలియక ఆ గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఊరిలో దృష్ట్యా శక్తులు తిరుగుతున్నాయని ప్రజలు వణికిపోతున్నారు. దీంతో నిద్రహారాలు మాని రాత్రిళ్లు జాగారాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం చిన్నతురకపాలెంలో ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ 15 రోజుల క్రితం ఓ ఇంటి ముందు గోడకు మేకులు కనిపించాయి. ఆ తర్వాత రోజు చెట్టుకు కనిపించాయి. మొదట్లో వీటిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత రోజు నుంచి అదే విధంగా గోడలకు, చెట్టలు మెకులు కనిపిస్తున్నాయి. మూడు రోజుల తరువాత నిమ్మకాయలు, పసుపు-కుంకుమ దర్శనం ఇస్తున్నాయి. రాత్రిళ్లు మాములుగానే ఉన్నా.. తెల్లారే సరికి నిమ్మకాయలు, డబ్బులు, అన్నం వెదజల్లుతున్నారు. ఈ వరుస సంఘటనలకు గ్రామస్తులు భయాందోళనలకు గురి అవుతున్నారు. అలా ప్రతీ రోజు జరుగుతుండడంతో గ్రామంలో దుష్టశక్తి తిరుగుతుందని, గ్రామానికి చేతబడి చేస్తున్నారని ప్రజలు అనుమాన పడుతున్నారు. దాంతో రాత్రిళ్లు నిద్రపోవడం మానేసి జాగారాలు చేస్తున్నారు.
తెల్లారితే ఏం చూడాల్సి వస్తుందో అని రాత్రంతా జాగారాలు చేస్తున్నారు. కర్రలతో గుంపులు గుంపులుగా కాపాలా కాస్తున్నారు. ఇతర గ్రామస్తులు ఎవరు తమ ఊళ్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రోడ్డుపై ముళ్ల కంచెలతో బందోబస్తు చేస్తున్నారు. ఇలా 15 రోజుల నుంచి జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసులు కానీ స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ఇది ఆకతాయిలు చేసే పని కొట్టేశామని కానీ ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందని ప్రజలు భయపడుతున్నారు.