»Cm Jagan Has Criticized Chandrababu For Launching The Varikapudishela Lifting In Palnadu District
CM Jagan: కుప్పం ప్రజలకే నీళ్లివ్వని చంద్రబాబు ఏం బాగుచేస్తాడు
వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయ్యేదని, గత పాలకులు ప్రజలను పట్టించుకోలేదని అన్నారు. రూ.340 కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు తెలిపారు.
CM Jagan has criticized Chandrababu for launching the Varikapudishela lifting in Palnadu district
CM Jagan: పల్నాడు జిల్లా(Palnadu district) మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల(Varikapudishela lifting) పథకానికి ముఖ్యమంత్రి జగన్(CM Jagan) శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. గత పాలకులకు శుత్తశుద్ది లేదని, అందుకే ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ చేపట్టి మధ్యలో వదిలేశారని, ప్రస్తుతం అన్ని అనుమతులతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని జగన్ పేర్కొన్నారు. దశలవారీగా ఈ ప్రాజెక్ట్ను మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తామని, దీని ద్వారా సాగు నీరు, తాగు నీరు ప్రజలకు అందిస్తామని చెప్పారు. పల్నాడు పౌరుషాల గడ్డను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకే ఈ పథకం అని జగన్ అన్నారు. పల్నాడును జిల్లా చేయడమే కాకుండా విద్యావ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు, డిగ్రీ కాలేజీలతో పాటు మెడికల్ కాలేజీని తీసుకొచ్చామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళల సాధికారతకు కృషి చేశామని, గత పాలకులకు అవేవి పట్టలేదన్నారు. 2 లక్షల 40 వేల కోట్లను మహిళ ఖాతల్లో వేశామని, కోవిడ్ కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదని పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా చంద్రబాబు(Chandrababu) ఏం అభివృద్ధి చేశాడని, ఆయన పాలనలో మోసాలు, దోపిడి, వెన్నుపోట్లు తప్ప అభివృద్ధి శూన్యం అని జగన్ ఆరోపించారు. ఆయన సొంత నియోజకవర్గం అయిన కుప్పం ప్రజలకే నీళ్లు ఇయ్యలేని బాబు మిగితా ప్రాంతాలను అభివృద్ధి చేస్తాడా అని ఎద్దేవా చేశారు. ఇప్పటి పరిస్థితి గురించి, జరుగుతున్న అభివృద్ధి గురించి చెప్పే ధైర్యం లేదు కానీ 50 సంవత్సరాల తరువాత జరిగేదాని గురించి చెప్తాడన్నారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచినోడు ప్రజలను మోసం చేయకుండా ఉంటాడా అని దుయ్యబట్టారు. వైసీపీకి ఏ పొత్తులు అవసరం లేదని, ప్రజలు దీవెనలు ఉంటే చాలని సీఎం జగన్ వెల్లడించారు.