»Balayyas Visit To Hindupuram Is Finalized Ycp Bus Trip At The Same Time
Balakrishna: హిందూపురంలో బాలయ్య పర్యటన ఖరారు..అదే టైంలో వైసీపీ బస్సు యాత్ర
హిందూపురంలో రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. దాదాపు 10 నెలల తర్వాత బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ తరుణంలోనే వైసీపీ నేతలు బస్సు యాత్రను చేపట్టనున్నారు.
టీడీపీ (TDP) నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) దాదాపు 10 నెలల తర్వాత తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్య పది నెలలుగా తన నియోజకవర్గానికి రాలేదు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. ఎట్టకేలకు ఆయన హిందూపురం పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు బాలయ్య పర్యటనకు గట్టిగా ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు.
హిందూపురం (Hindupuram) టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు బాలకృష్ణ హాజరు కానున్నారు. ఆ తర్వాత అదే రోజు జనసేన, టిడిపి సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. రెండు పార్టీల నేతలతో బాలయ్య మాట్లాడి కీలక సందేశాన్ని ఇవ్వనున్నారు. బాలయ్య తన నియోజకవర్గం వైపు తొంగిచూడకపోవడంతో వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రజలను పట్టించుకోడని విమర్శలు గుప్పించారు. అలాగే ఈసారి ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తే అస్సలు గెలవలేడని వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ (YCP) నేతల మాటలకు పుల్‌స్టాప్ పెడుతూ బాలకృష్ణ (Balakrishna) తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బాలయ్య పర్యటనతో తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తల్లో ఫుల్ జోష్ వచ్చింది. ఇదిలా ఉంటే హిందూపురంలో వైసీపీ కూడా సామాజిక బస్సు యాత్రను చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో మరింత ప్రధాన్యత సంతరించుకుంది.
ఓ వైపు వైసీపీ బస్సు యాత్ర (Bus Yatra), మరోవైపు బాయల్య పర్యటన ఉండటంతో హిందూపురం రాజకీయాలు (Hindupur Politics) మరింత హీటెక్కనున్నాయి. నవంబర్ 15వ తేది నుంచి రెండో విడత బస్సు యాత్రను వైసీపీ చేపట్టనుంది. నవంబర్ 30వ తేది వరకూ వైసీపీ బస్సు యాత్ర సాగనుంది. రెండో దశలో వైసీపీ దాదాపు 40 నియోజకవర్గాల్లో బస్సు యాత్రను చేపట్టనుంది.