ఓ పెళ్లి వేడుకలో ఫంక్షన్ హాల్లో భాగంగా అంతా సందడి నెలకొంది. మరోవైపు వచ్చిన అతిథుల కోసం వంట మనుషులు పెద్ద ఎత్తున వంటకాలు సిద్ధం చేస్తున్నారు. అదే క్రమంలో ఆకస్మాత్తుగా అరుపులు వినిపించాయి. ఎంటా అని ఆరా తీస్తే వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ సిలిండర్ ఆకస్మాత్తుగా పేలింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. అంతేకాదు మంటలు సమీప ప్రాంతాలకు కూడా వ్యాపించి ప్లాస్టిక్ కూర్చీలకు కూడా అంటుకున్నాయి.
వెంటనే గమనించిన స్థానికులు వాటినే ఆపే ప్రయత్నం చేశారు. దీంతోపాటు అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. ఆ క్రమంలో వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను ఆర్పివేసి పెను ప్రమాదం ముప్పును తప్పించారు. ఆ క్రమంలో సకాలంలో స్పందించిన వెంటనే వచ్చి మంటలార్పిన సిబ్బందిని పెళ్లికి వచ్చిన పలువురు ప్రశంసించారు. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేసినందుకు సిబ్బందిని అభినందించారు. ఈ సంఘటన పల్నాడు జిల్లాలోని
చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామంలో చోటుచేసుకుంది.