»Ttds Key Decision No Permission For Vehicles Over 12 Years Old
Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. 12ఏళ్లు దాటిన వాహనాలకు నో పర్మిషన్
ఘాట్ రోడ్డు(Tirumala Ghaat Road)లో వాహనాల పర్యవేక్షణకు పోలీస్, విజిలెన్స్ , ట్రాన్స్ పోర్టు విభాగాలతో ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ(TTD) తెలిపింది. మరో వైపు 12 ఏళ్లకు పైబడిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని ప్రకటించింది.
తిరుమల(Tirumala) కొండపైకి వచ్చే వాహనాల విషయంలో టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. 12ఏళ్లు దాటిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డు(Tirumala Ghaat Road)పైకి అనుమతించకూడదని ప్రకటించింది. తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదాల(Road Accidents)కు చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల వ్యవధిలో తిరుమల ఘాట్ రోడ్డుపై రెండు ప్రమాదాలు జరిగాయి.
మే నెల 24న 28వ మలుపు వద్ద ప్రమాదం జరగ్గా ఆ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. అలాగే ఈ నెల 29న తిరుమల ఘాట్ రోడ్డు(Tirumala Ghaat Road)లోని ఆరో మలుపు వద్ద మరో ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు గాయాలపాలయ్యారు. తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఘాట్ రోడ్డు(Tirumala Ghaat Road)లో వాహనాల పర్యవేక్షణకు పోలీస్, విజిలెన్స్ , ట్రాన్స్ పోర్టు విభాగాలతో ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ(TTD) తెలిపింది. మరో వైపు 12 ఏళ్లకు పైబడిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని ప్రకటించింది. సెల్ ఫోన్ డ్రైవింగ్, వేగంగా వాహనాలు నడపడం, నిద్రలేమి, ఫిట్ నెస్ లేని వాహనాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మరిన్ని చర్యలు కార్యరూపం దాల్చనున్నట్లు టీటీడీ తెలిపింది.