»Till Now Elections Are Held In Ap Tdp Will Be In Power
Till now elections in AP:టీడీపీదే అధికారం:సర్వే, ఓడిపోయే మంత్రులు, మాజీ మంత్రులు వీరే
Till now elections in AP:ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదే అంశంపై తెలుగు360 (telugu360) ట్విట్టర్లో ఓ సర్వే రిపోర్ట్‌ను (survey report) షేర్ చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ (tdp) 91 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని పేర్కొంది.
Till now, if elections are held in AP, TDP will be in power
Till now elections in AP:ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదే అంశంపై తెలుగు360 (telugu360) ట్విట్టర్లో ఓ సర్వే రిపోర్ట్‌ను (survey report) షేర్ చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ (tdp) 91 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని పేర్కొంది. ఇందులో 78 సీట్లు (78 seats) టీడీపీ (tdp) పక్కా గెలుచుకోనుండగా.. 13 సీట్లు (13 seats) మాత్రం బోటాబోటీ పోటీలో నెగ్గుతుందని తెలిపింది. ఇక అధికార వైసీపీ 63 సీట్లలో (seats) విజయం సాధిస్తోందని తెలిపింది. 14 చోట్ల (14 seats) మాత్రం పోటాపోటీ ఎన్నికల్లో గెలుస్తోందని వివరించింది.
శ్రీకాకుళం (srakakulam) జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉండగా వైసీపీ 2.. టీడీపీ 6 సీట్లు గెలుచుకుంటాయట. 2 సీట్లలో మాత్రం పోటా పోటీ ఉంటుందట. విజయనగరంలో 3 చోట్ల వైసీపీ, 4 చోట్ల టీడీపీ దక్కించుకుంటాయని పేర్కొంది. 2 చోట్ల పోటా పోటీ ఉంటుందని వివరించింది. విశాఖపట్టణంలో వైసీపీ 5, టీడీపీ 7 సీట్లు గెలుస్తాయట.. 3 చోట్ల పోటా పోటీ ఉంటుందట. తూర్పు గోదావరి జిల్లాలో ఆరు వైసీపీ, 6 టీడీపీ గెలువనుండగా.. 4 చోట్ల జనసేన గెలుస్తుందట.. 3 చోట్ల పోటా పోటీ ఉంటుందని తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 చోట్ల వైసీపీ, 8 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన గెలుస్తాయట. 2 చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపింది.
కృష్ణా జిల్లాలో (krishna) వైసీపీ 5, టీడీపీ 8 చోట్ల.. 3 చోట్ల మాత్రం టఫ్ ఉంటుందట. గుంటూరులో వైసీపీ 6, టీడీపీ 8 చోట్ల, 3 చోట్ల పోటా పోటీ ఉంటుందని వివరించింది. ప్రకాశంలో వైసీపీ 5, టీడీపీ 6, ఒక సీటుకు బోటా బోటీ ఉంటుందని వివరించింది. నెల్లూరులో 2 చోట్ల వైసీపీ, 5 చోట్ల టీడీపీ, 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందట. చిత్తూరులో 8 చోట్ల వైసీపీ, 4 చోట్ల టీడీపీ.. 2 చోట్ల పోటా పోటీ ఉంటుంది. అనంతపురంలో వైసీపీ 6, టీడీపీ 7 ఒక చోట టఫ్.. కడపలో 6 చోట్ల వైసీపీ, 2 చోట్ల టీడీపీ, మరో రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక కర్నూలు విషయానికి వస్తే 7 చోట్ల వైసీపీ, 7 చోట్ల టీడీపీ గెలుస్తాయని సర్వేలో వివరించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ వైసీపీ 63 చోట్ల.. టీడీపీ 78 సీట్లు, జనసేన 7 సీట్లను గెలుస్తాయని తెలిపింది. 27 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందట. వాటిలో టీడీపీ 13 సీట్లు.. 14 సీట్లలో వైసీపీ గెలుచుకుంటుందని వివరించింది.
అంతేకాదు మంత్రులు (ministers) కొట్టు సత్యానారాయణ, గుడివాడ అమర్ నాథ్, వెంకట నాగేశ్వర రావు, జోగి రమేశ్, తానేటి వనిత, మెరుగ నాగార్జున, విడదల రజనీ, విశ్వరూప్, ఉష శ్రీ చరణ్, అప్పలరాజు, ఆర్కే రోజా, గుమ్మనూరు జయరాం ఓడిపోతారనే సంచలనం విషయం తెలియజేసింది. వీరి పనితీరు 30 శాతం కన్నా తక్కువగా ఉందని.. ప్రజల్లో వ్యతిరేకత ఉందని పేర్కొంది. ఇక మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని, శ్రీనివాస్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్, శంకర్ నారాయణ, పేర్ని నాని కూడా ఓడిపోతారని తెలిపింది.