పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పట్టాలు దాటుతుండగా ఎదురుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శనివారం అర్థరాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగగా.. గూడూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఢీకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు రైలు పట్టాలపైనే మరణించగా.. మహిళ పట్టాలపైనుంచి కిందపడి చనిపోయినట్లు గుర్తించారు. మృతుల ముగ్గురి వయస్సు 40 నుంచి 50 ఏళ్లు ఉంటాయని రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.