»The Srisailam Brahmotsavam Is Going On With Grandeur
Srisailam: నేడు హంస వాహనంపై శ్రీశైల ఆది దంపతులు
శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. శ్రీశైలంలో రోజురోజుకూ భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. నేటి సాయంకాలం హంస వాహనం పై శ్రీశైల(Srisailam) ఆది దంపతులు ఊరేగనున్నారు.
శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. శ్రీశైలంలో రోజురోజుకూ భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. నేటి సాయంకాలం హంస వాహనం పై శ్రీశైల(Srisailam) ఆది దంపతులు ఊరేగనున్నారు. లోక కళ్యాణం కోసం రుద్ర హోమం, చండీ హోమం, జపాలు, పారాయణాలను పండితులు చేయనున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. సోమవారం సాయంకాలం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
శ్రీశైలం(Srisailam)లో నిర్వహించే గ్రామోత్సవంలో బాగంగా పలు జానపద కళారూపాలను ప్రదర్శించనున్నారు. అలాగే ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధాన వేదిక వద్దు, అలాగే పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించానున్నరు. శ్రీశైలం(Srisailam)లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు కటాక్షించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోది శ్రీశైల మహాక్షేత్రం(Srisailam)లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి.
నిన్న శ్రీశైలం(Srisailam) ఆలయంలో భ్రామరి సమేతుడైన ముక్కంటీశుడు త్రిశూలధారియై భృంగివాహనంపై ఊరేగారు. చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, శివ పంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణాలు వంటివి ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగాయి. మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్లతో క్షేత్ర ప్రధాన వీధుల్లో స్వామి వారు విహరించారు. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహుడైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంబ్ పథక్, గొరవ నృత్యం, బుట్టబొమ్మలు, భీరప్పడోలు, నందికోల సేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మల విన్యాసాలతో బ్రహ్మోత్సవాలు సందడిగా సాగాయి. శ్రీశైలం(Srisailam)లో భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి భక్తులు తమ విరాళాలను సమర్పించారు. ఈ క్రమంలో విశాఖపట్నం వాసి శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి రూ.1.10 లక్షల డీడీని ఏఈవో పణీంధ్ర ప్రసాద్‌కు అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్ వాసి ఫణి కుమార్ కూడా గో సంరక్షణ నిధికి రూ.1,01,116 విరాళాన్ని అందించారు.
శ్రీశైలం(Srisailam) బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీగిరి పురవీధులు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. శ్రీశైలానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అర్జిత సేవా టికెట్లను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఇరుముడితో వచ్చే శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లో నిర్దిష్ట సమయంలో స్పర్శ దర్శనం అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.