విశాఖలో పవన్ పర్యటిస్తున్నారు. రుషికొండను పరిశీలించేందుకు వెళ్తున్న పవన్‌కు పోలీసులు నిబంధనలతో కూడిన నోటీసులిచ్చారు. పవన్య పర్యటన సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రుషికొండ పరిశీలనకు వెళ్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రకటించడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. రిషికొండ(Rushikonda)కు కొంత దూరంలో ఉన్నటువంటి జోడుగుళ్లపాలెం నుంచి ఎవ్వరినీ అనుమతించమని నోటీసులిచ్చారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి పవన్ వెహికల్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. రుషికొండ పైకి పవన్ వెళ్లకూడదని కండీషన్ పెట్టారు.
ప్రస్తుతం విశాఖలోని నోవాటెల్ నుంచి రుషికొండకు పవన్ బయల్దేరారు. పవన్ పర్యటనలో ఆయన కారుతో పాటు మరో ఏడు కార్లకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇచ్చారు. ఇకపోతే నోవాటెల్ నుంచి రుషికొండ(Rushikonda)కు 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా రుషికొండకు వెళ్తున్నారు. పోలీసులు పవన్ పర్యటిస్తున్న మార్గంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
మరోవైపు పవన్ వారాహి యాత్రలో భాగంగా నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు. నిబంధలను ఉల్లంఘించారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, విద్వేషాలు రగిల్చే వ్యాఖ్యలు చేయొద్దని పోలీసులు పవన్‌కు సూచించారు. జోడుగుళ్లపాలెం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం విశాఖలో పవన్ కారును ఆయన కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా ఫాలో అవుతున్నారు.
పవన్(pawan) కారుకు ముందే కార్యకర్తలు, అభిమానులు వాహనాలను నెట్టేసి మరీ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన(janasena) కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పవన్ కార్యకర్తలు, అభిమానులు జోగుళ్లపాలెం వద్దే ఆగిపోవాలని పోలీసులు హెచ్చరించారు. బ్యారికేడ్లతో పాటు వాహనాలను కూడా రోడ్డుపై అడ్డుగా పెట్టి పోలీసులు గట్టి నిఘా ఉంచారు.