tdp leaders met governer:లోకేశ్‌కు ప్రాణహానీ, గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
tdp leaders are met the governer:నారా లోకేశ్ (nara lokesh) యువగళం (yuvagalam) పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే యాత్ర చేస్తోన్న తమ నేత ప్రాణాలను హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు గవర్నర్ (governer) బిశ్వభూషణ్ హరిచందన్‌కు (biswabhusan harichandan) ఫిర్యాదు చేశారు.
tdp leaders are met the governer:నారా లోకేశ్ (nara lokesh) యువగళం (yuvagalam) పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే యాత్ర చేస్తోన్న తమ నేత ప్రాణాలను హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు గవర్నర్ (governer) బిశ్వభూషణ్ హరిచందన్‌కు (biswabhusan harichandan) ఫిర్యాదు చేశారు. నిఘా ముసుగులో డ్రోన్ల (drones) సాయంతో పోలీసులు లోకేశ్ (lokesh) లేని చోట చిత్రీకరిస్తున్న ఫుటేజీని టీడీపీ నేతలు గవర్నర్‌కు అందజేశారు. లోకేశ్ (lokesh) పాదయాత్రకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ప్రజలతో (people) మాట్లాడకుండా మైక్ లాగేసుకుంటున్నారని టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర (kollu ravindra), బొండా ఉమ (bonda uma), నక్కా ఆనంద్ బాబు (nakka ananda babu) అన్నారు. వాహనాలు సీజ్ చేస్తున్నారని గవర్నర్‌కు వివరించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం నక్కా ఆనంద్ బాబు (nakka anand babu) మీడియాతో మాట్లాడారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేలా ఇంటెలిజెన్స్ అధికారి రఘురామరెడ్డి, స్థానిక పోలీసులతో కలిసి కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేశ్ (lokesh) భద్రత పట్ల ఆందోళన చెందుతున్నారు.
లోకేశ్ పాదయాత్ర సమయంలో డ్రోన్లు (drones) తిరుగుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియాలో (ycp social media) వస్తున్న పోస్టులు చూడాలని కోరారు. సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) కొడుకు భార్గవ (bhargava) వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని నడిపిస్తున్నాడని నక్కా ఆనంద్ బాబు వివరించారు.
బొండా ఉమ (bonda uma) మాట్లాడుతూ.. తాడేపల్లి ఆదేశాల మేరకు డీఐజీ రఘురామరెడ్డి (raghurama reddy) వెనుక ఓ కారులో ఉంటూ నిర్విరామంగా ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు. నారా లోకేశ్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
వై నాట్ 175 కాదు జగన్ మోహన్ రెడ్డీ.. వై నాట్ తాడేపల్లి ప్యాలెస్‌గా మిగిలిపోతావు అని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (kollu ravindra) హెచ్చరించారు. ఇలాంటి సీఎంకి తొత్తులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో గౌతమ్ సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి వారే నిదర్శనం అని అన్నారు. రాష్ట్రంలో గల ఉన్నతాధికారులు ఈ విషయం గమనించాలని అన్నారు.