»Supreme Court Orders Cbi To Change Investigating Officer
YS Viveka హత్య కేసులో విచారణ అధికారిని మార్చండి, సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం
Supreme Court:మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka) హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహాం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో (status report) ఎలాంటి పురోగతి లేదని అభిప్రాయపడింది. ఎంక్వైరీ (enquiry) మరింత వేగవంతం చేయాలని స్పష్టంచేసింది.
Supreme Court orders CBI to change investigating officer
Supreme Court:మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka) హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహాం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో (status report) ఎలాంటి పురోగతి లేదని అభిప్రాయపడింది. ఎంక్వైరీ (enquiry) మరింత వేగవంతం చేయాలని స్పష్టంచేసింది. వివేకానంద (viveka) హత్య రాజకీయ కారణాల వల్లే జరిగిందని సీబీఐ వాదిస్తోందని ధర్మాసనం పేర్కొంది. ఆయన హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలను బయటపెట్టాలని సూచించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
ఇటు వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash) సీబీఐ పలుమార్లు విచారించింది. ఇటీవల పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను (sudhakar) విచారించారు. ఎంపీ అవినాష్‌రెడ్డితో (avinash reddy) ఫోటో దిగిన విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది. వివేకా (viveka murder case) హత్య కేసులో ఇప్పటికే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి (krishna mohan reddy), జగన్ భార్య భారతి (bharathi) పీఏ నవీన్ (naveen)ను విచారించారు.
వివేకా హత్య (viveka murder) జరిగిన చోట దొరికిన లెటర్ కీలక సాక్ష్యం అని అవినాష్ (Avinash) అంటున్నారు. ఆ లేఖను సునీత భర్త రాజశేఖర్ దాచారని ఆరోపించారు. హత్య జరిగిన మధ్యాహ్నం వరకు ఎవరికీ ఇవ్వలేదని.. గుండెపోటుతో చనిపోయారని తాను చెప్పలేదన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని చెప్పారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని అవినాష్ అన్నారు. నిందితులతో సీబీఐ కుమ్మక్కైందని.. సునీతకు లీకులు ఇస్తోందని చెప్పారు.
2006 నుంచి వివేకాకు ఓ మహిళతో సంబంధం ఉంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు పేరు మార్చుకున్నారు. వారికి షేక్ షహన్ షా అనే బాబు పుట్టాడని చెప్పాడు. రెండో వివాహాం అంటే మొదటి భార్య పిల్లలకు నచ్చదని అవినాష్ చెబుతున్నాడు. వివేకానంద పవర్ ఆఫ్ అటర్నీని కూతురు సునీత అండ్ కో లాగేశారని.. ఈ క్రమంలో రెండో భార్య కుటుంబం హత్యకు పాల్పడి ఉండొచ్చని అవినాశ్ రెడ్డి సందేహాం వ్యక్తం చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని చెప్పారు.