»Bilkis Bano Case Convict Seen Sharing Stage With Bjp Mp Mla
BJP MP, MLAతో వేదిక పంచుకున్న బిల్కిస్ బానో కేసు దోషి
Bilkis Bano case convict share stage:గోద్రా అల్లర్ల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) లైంగికదాడి చేసి.. ఆమె కుటుంబంలో ఏడుగురు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో 11 మంది దోషులకు గతేడాది ఇండిపెండెన్స్ డే ముందు సత్ప్రవర్తన కింద విడుదల అయ్యారు. దీనిపై బిల్కిస్ బానో (Bilkis Bano) సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (supreme court) కూడా ఆశ్రయించారు.
Bilkis Bano case convict seen sharing stage with BJP MP, MLA
Bilkis Bano case convict share stage:గోద్రా అల్లర్ల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) లైంగికదాడి చేసి.. ఆమె కుటుంబంలో ఏడుగురు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో 11 మంది దోషులకు గతేడాది ఇండిపెండెన్స్ డే ముందు సత్ప్రవర్తన కింద విడుదల అయ్యారు. దీనిపై బిల్కిస్ బానో (Bilkis Bano) సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (supreme court) కూడా ఆశ్రయించారు. అయితే ఆ కేసులో ఓ దోషి.. అధికార పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
గుజరాత్లో (gujrat) ఆదివారం బీజేపీ ఎంపీ (bjp mp) జస్వంత్ సిన్హ్ భాబుర్, అతని సోదరుడు, ఎమ్మెల్యే (mla) శైలేష్ భాబుర్ కలిసి నీటి సరఫరా పథకం ప్రారంభించారు. ఆ వేదికపై బిల్కిస్ బానో కేసులో దోసి శైలేష్ ఛిమన్లాల్ భట్ (Shailesh Chimanlal Bhatt) కనిపించాడు. ఎంపీ, ఎమ్మెల్యే కలిసి పూజ చేస్తుండగా.. వారితో వేదికపై ఉన్నాడు. తర్వాత ఆ ఫోటోలు షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి రాక్షసులు తిరిగి జైలుకు వెళ్లాలని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ట్వీట్ చేశారు. అతనిని ప్రభుత్వం ఎలా బయటకు తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చింది? న్యాయ వ్యవస్థ ఎందుకు అంగీకారం తెలిపింది అని ప్రశ్నించారు.
2002లో గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) లైంగికదాడి చేశారు. ఆ కేసులో కోర్టు 11 మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గత ఏడాది సత్ప్రవర్తన కింద గుజరాత్ ప్రభుత్వం వారు విడుదలకు సిఫారసు చేసి, విడుదల చేసింది. జైలు నుంచి విడుదల అవడంపై సుప్రీంకోర్టులో కేసులు నమోదయ్యాయి. దీనిపై ఈ రోజు (సోమవారం) విచారణ జరగనుంది. ఆ కేసు దోషులు మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనిపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
బిల్కిస్ బానో (Bilkis Bano) కేసులో రాధేశ్యాం సా, జస్వాంత్ ఛతుర్వేది నాయి, కేశుభాయ్ వాదనియా, బాకభాయ్ వాదనియ, రాజిభాయ్ సోని, రమేశ్భాయ్ చౌహాన్, శైలేస్ భాయ్ భట్, బిపిని చంద్ర జోషి, గోవింద్ భాయ్ నాయ్, మిటేశ్ భట్, ప్రదీప్ మోదియ లైంగికదాడి చేశారు. ఈ కేసును ముంబై సీబీఐ కోర్టు విచారించి.. 2008 జనవరి 21వ తేదీన 11 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును బొంబై హైకోర్టు సమర్థించడంతో శిక్ష అమలు చేశారు. గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది సత్ప్రవర్తన కింద వారిని విడుదల చేసేందుకు అనుమతి కోరగా.. ముంబై హైకోర్టు అంగీకారం తెలిపింది. దీంతో ఆ 11 మంది జైలు నుంచి విడుదల అయ్యారు.
Bilkis Bano's Rapist Shares Stage With Gujarat's BJP MP, MLA.
I want to see these monsters back in jail & the key thrown away. And I want this satanic government that applauds this travesty of justice voted out. I want India to reclaim her moral compass. pic.twitter.com/noaoz1c7ZW