»Not 10 Crores His Value Rs 10 Thousand Is More Than Bonda Uma On Rapaka Varaprasad
Rs.10 thousand is more than To రాపాక వరప్రసాద్: బొండ ఉమా ఫైర్
Bonda uma:ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అగ్గిరాజేసింది. ఎమ్మెల్సీల కొనుగోలుకు సంబంధించి ప్రధాన పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. తనకు రూ.10 కోట్ల ఆఫర్ చేశారని జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (rapaka varaprasad) టీడీపీపై ఆరోపణలు చేయడంతో.. వివాదం ముదిరింది. టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తోండగా.. ఆ పార్టీ వ్యవహారశైలి ఇదేనని వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది.
Not 10 crores his value rs.10 thousand is more than bonda uma on rapaka varaprasad
Bonda uma:ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అగ్గిరాజేసింది. ఎమ్మెల్సీల కొనుగోలుకు సంబంధించి ప్రధాన పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. తనకు రూ.10 కోట్ల ఆఫర్ చేశారని జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (rapaka varaprasad) టీడీపీపై ఆరోపణలు చేయడంతో.. వివాదం ముదిరింది. టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తోండగా.. తెలుగుదేశం పార్టీ వ్యవహారశైలి ఇదేనని వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ (Bonda uma) స్పందించారు. ఆయన తాడేపల్లి స్క్రిప్ట్ చదివారని విమర్శించారు. అతనో చిల్లర మనిషి అని, జనసేనలో గెలిచి వైసీపీకి అమ్ముడుపోయారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఈ రోజు నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. రాపాక వరప్రసాద్‌ను కొనాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. టీడీపీకి కావాల్సిన 23 ఓట్లు స్పష్టంగా ఉన్నాయని బొండా ఉమ (Bonda uma) స్పష్టంచేశారు. అంతేకాదు అసలు రాపాకను రూ.10 కోట్లు పెట్టి కొనేది ఎవరని సూటిగా అడిగారు. అతడికి రూ.10 వేలు కూడా ఎక్కువేనని సెటైర్లు వేశారు.
రాపాక వరప్రసాద్ ఇప్పటికే అమ్ముడుపోయిన సరుకు అంటూ బొండ ఉమా (Bonda uma) ధ్వజమెత్తారు. ఆల్రెడీ కొనేశారు నాయనా… ఈ ప్రాపర్టీ వైసీపీకి చెందుతుందని ఎద్దేవా చేశారు. మీరు, మీలాంటి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఎందుకు సమాధానం చెప్పు అని రాపాక వరప్రసాద్‌ను (rapaka varaprasad) నిలదీశారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka vara prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోనే బేరసారాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి ఓటు వేయాలని.. టీడీపీ నేతలు తన మిత్రుడిని సంప్రదించారని వివరించారు. అలా వేస్తే రూ.10 కోట్లు (10 crores) ఇచ్చే వారని పేర్కొన్నారు. రాజోలులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తన మిత్రుడు కేఎస్ఎన్ రాజుతో (ksn raju) టీడీపీ నేతలు బేరం ఆడారని వివరించారు. అసెంబ్లీ వద్ద కూడా ఒక రాజు తనతో బేరాలకు దిగారని హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారని తెలిపారు. కానీ అందుకు అంగీకరించలేదని చెప్పారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమని చెప్పారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ.10 కోట్లు (10 crores) వచ్చేవని తెలిపారు. తాను సీఎం జగన్‌ను (jagan) విశ్వసించానని స్పష్టంచేశారు. టీడీపీ ఆఫర్ తిరస్కరించానని ఆయన వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (anuradha) విజయం సాధించారు. అనురాధకు ఆనం రాంనారాయణ రెడ్డి (anam ram narayana reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy), ఉండవల్లి శ్రీదేవి (sirdevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (chandra shekar reddy) ఓటు వేశారట.. వారిని సస్పెండ్ చేశామని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ప్రకటించారు.