టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ(nandigama) పర్యటనలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయితో విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మధుబాబుకి గాయమైనట్లు తెలిసింది.
ఈ క్రమంలో అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ దాడులకు బయపడేది లేదని వెల్లడించారు.