తిరుపతి (Tirupati) కాలినడక మార్గంలో ప్రతి 10 మీటర్లకు సెక్యూరిటీ గార్డును నియమిస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. అయినప్పటికీ కాలిబాటలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి’’ అని ఈవో ధర్మారెడ్డి (Evo Dharma Reddy) సూచించారు. చిరుత దాడి (Lion attack) లో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిన్నారి రక్షిత మృతి చెందడం బాధాకరమన్నారు. చిరుత దాడి నేపథ్యంలో తిరుమల జేఈవో కార్యాలయంలో అటవీశాఖ, పోలీసు అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు. అలిపిరి(Alipiri)లో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు చిన్నారి తప్పిపోయిందన్నారు. పాప ఆచూకీ కోసం సుమారు 70 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు.
సీసీ కెమెరాల ద్వారా చూస్తే కాలినడక మార్గంలో చిరుత దాడి ఘటన జరగలేదు. కాలినడక నుంచి చిన్నారి అటవీ ప్రాంతంలోకి వెళ్లిందా? అనే కోణంలో విచారణ చేపట్టాం. చిరుతను బంధించేందుకు ఇప్పటికే రెండు బోన్లు ఏర్పాటు చేశాం. అలాగే రెండు కాలినడక బాటలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నాం. తితిదే ఛైర్మన్, (TTD chairman) అధికారులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. చిన్న పిల్లలు చివరల ఉండకుండా పెద్దవారి మధ్యన ఉండేలా చూసుకుకోవాలని ఆయన సూచించారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం కెమెరా ట్రాప్స్ కూడా సిద్ధం చేశారని చెప్పారు. శ్రీవారి మెట్టు మార్గం(Step way)లో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి నడక మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారని ఈవో చెప్పారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఘాట్రోడ్ల(Ghatroads)లో బైక్ లపై వెళ్లే వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు.