»Ap Tdp Chandrababu Responded To The Incident Of Tirumala Child Killed By A Leopard
Chandrababu: తిరుమలలో రక్షణ చర్యలు ఉన్నాయా.. ఇంకెన్ని జరగాలి
కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ళ చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్ళముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికారుల నిర్లక్ష్యం అని పేర్కొన్నారు.
IT department has given show cause notices to Chandrababu in 118 crore scam.
Chandrababu: తిరుపతి(Tirupati) వెంకటేశ్వర స్వామిని ధర్శించుకోవడానికి వళ్లి ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఓ చిన్నారి చిరుత(Leopard) దాడిలో మరణించింది. దీంతో అలిపిరి(Alipiri) మార్గంలో ప్రయాణించే భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ ఘటనపై పలువురు అధికారులు మాట్లాడారు. కానీ భక్తులకు ఏ భరోసా ఇవ్వలేక పోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chadrababu) స్పందించారు. తిరుమల అలిపిరి మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి అత్యంత బాధాకరమన్నారు. పాప తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి లక్షిత(Lakshitha) చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్లముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతం. పాప తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డ ఘటనను చంద్రబాబు గుర్తు చేశారు. దానితో ప్రభుత్వం అప్రమత్తం అయి, టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేదని అన్నారు. అధికారులు సమర్థ ప్రణాళికతో వ్యవహరించాలని, తగిన రక్షణ చర్యలతో భక్తుల భయాన్ని తొలగించాలని సూచించారు.