»Secunderabad Tirupati Vande Bharat Train To Start On April 8th 2023
Vande Bharat Train: సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఏప్రిల్ 8న ప్రారంభం!
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలు(Vande Bharat Train)ను ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ, ఏపీ మధ్య రెండో వందే భారత్ రైలు(Vande Bharat Train)ను ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రదాని నరేంద్ర మోదీ(PM modi) జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలిసింది.
ఈ సేవలు సికింద్రాబాద్-తిరుపతి(Secunderabad-Tirupati) మధ్య వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణించేందుకు 11 గంటల నుంచి 12 గంటల సమయం పడుతుంది. కానీ వందే భారత్ ట్రైన్ ద్వారా గమ్యస్థానానికి చేరుకోవడానికి కేవలం 8 గంటల 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అంటే దాదాపు మూడు గంటల సమయం ఆదా అవుతుంది. దీంతోపాటు వందే భారత్ రైలులో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రారంభోత్సవం రోజున వందే భారత్ రైలు(Vande Bharat Train) నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో రైలు ఆగనున్నట్లు తెలిసింది. అయితే సాధారణ రోజుల్లో వందే భారత్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది.
దీంతోపాటు సికింద్రాబాద్, మేడ్చల్ మధ్య MMTS రెండో దశను కూడా ప్రధాని(prime minister) జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్(Secunderabad station) ఆధునీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్-విద్యుదీకరణ మార్గాన్ని కూడా ఆరంభించనున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇంకా ఈ షెడ్యూల్‌పై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నిర్ధారణ కోసం వేచి చూస్తున్నట్లు తెలిసింది.