»Ktr Letter To Central Governament Stop Privatization Of Vizag Steel Plant
KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి
ఏపీ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు(KTR) ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ(letter) రాసి డిమాండ్ చేశారు. పలు కార్పొరేట్లకు రూ. 12.5 లక్షల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు.
ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో VSPని విలీనం చేసే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిని కేటీఆర్ సూచించారు. వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు ఆదాయం ముసుగులో కేంద్రప్రభుత్వం VSPని ప్రయివేటు కంపెనీలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని ఆయన కేంద్రానికి రాసిన బహిరంగ లేఖ(letter)లో పేర్కొన్నారు.
బీజేపీ(BJP) ప్రభుత్వం పలు కార్పొరేట్ కంపెనీల రుణాలను మాఫీ చేసిందని పరిశ్రమల శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో రూ.12.5 లక్షల కోట్లు ఉన్న VSP పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు కనికరం చూపడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆదాయాన్ని సమీకరించడంలో VSP ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం VSPకి రూ.5,000 కోట్ల ఆర్థిక సహాయం అందించాలన్నారు. గతంలో పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాలు ఇచ్చిన రుణాలను వీఎస్పీ వడ్డీతో సహా చెల్లించిందని గుర్తు చేశారు.
రూ.లక్షన్నర కోట్ల విలువ చేసే VSPని చిన్నచిన్న విలువలకు ప్రయివేటు కంపెనీలకు అప్పగించే కుట్రలను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు VSP మేనేజ్మెంట్ జారీ చేసిన ప్రతిపాదిత ఒప్పందంలో నిర్దిష్ట నిబంధనలు లేవని కేటీఆర్(KTR) ఆరోపించారు. ఇది వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కోసం ఆదాయాన్ని పూల్ చేసే ముసుగులో VSPని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే పన్నాగం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రయోజనాలను కాపాడటం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల బాధ్యత అని పేర్కొన్న కేటీఆర్, అటువంటి ప్రయత్నాలను BRS పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వీఎస్పీ వర్కర్స్ యూనియన్లకు బేషరతుగా మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ ఏపీ యూనిట్ చీఫ్ తోట చంద్రశేఖర్‌ను ఆదేశించారు.
వివిధ ప్రభుత్వ రంగ సంస్థల (PSU)లోని అన్ని కార్మిక సంఘాలకు పిలుపునిస్తూ, పిఎస్‌యులను కొన్ని కార్పొరేట్ దిగ్గజాల ప్రయోజనాల కోసం విక్రయించే మోడీ ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడడానికి BRSతో చేతులు కలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.