ఓ వృద్ధుడికి ఇద్దరు పోలీసులు(police) సహాయం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన పప్పును పోలీసులు ఓపికతో సేకరించి సంచిలోకి ఎత్తారు. ఇది చూసిన నెటిజన్లు వారు చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.
మీరెప్పుడైనా పోలీసులు(police) ఎవరికైనా సహాయం చేయడం చుశారా? చాలా తక్కువ అని చెప్పవచ్చు. కానీ ఇటీవల ఇద్దరు పోలీసులు ఓ వృద్ధుడికి(old man) సహాయం చేసి ఆ తక్కువ కేటగిరిలోకి చేరారు. ఈ సంఘటన యూపీలోని మీరట్(meerut)లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఓ వృద్ధుడు పప్పు సంచితో బైకుపై వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ అది కింద పడింది. దీంతో సంచిలో ఉన్న పప్పు దాదాపు సగం కింద పడింది. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఇద్దరు పోలీసులు అతనికి సహాయం చేశారు. ఆ వృద్ధుడితోపాటు పోలీసులు కూడా రోడ్డుపై పడిన పప్పును సేకరించి సంచిలోకి ఎత్తారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. ఆ క్రమంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి వీడియో తీయగా…దీన్ని యూపీ పోలీసులు వారి ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. కొన్ని గంటల్లోనే దాదాపు 5 వేల లైక్స్ వచ్చాయి.
ఇది చూసిన పలువురు నెటిజన్లు వాహ్ మీరు హృదయాలను గెలుచుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పోలీసులను ప్రజలు(people) కోరుకుంటున్నారని మరొకరు వ్యాఖ్యానించారు. గర్వించదగిన క్షణం మూడవ వ్యక్తి కామెంట్ చేశాడు. మంచి పని చేశారని నాల్గవ వ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. హీరోకు నిజమైన నిర్వచనం, చాలా ప్రేమ, చాలా చాలా గౌరవమని ఐదవ వ్యక్తి రాసుకొచ్చారు. ఇలా చాలా మంది ఈ పోలీసులు చేసిన సాయం పట్ల సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు.
అయితే మరోవైపు గతంలో పలు ప్రాంతాల్లో కొంత మంది పోలీసులు వృద్ధులు సహా కొంత మందితో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఇంకోవైపు మరికొంత మంది వాహనదారులు సైతం పోలీసులపై ఆవేశంతో మాట్లాడిన సందర్భాలు కూడా గతంలో నెట్టింట్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు వృద్ధుడికి హెల్ప్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.