Sdulterated Milk And Meat Seized: తెలుగు రాష్ట్రాల్లో కల్తీ పాలు, మాంసం..షాకైన అధికారులు
మనిషికి అత్యాశ పెరిగిపోవడం వల్ల అనేక దారుణాలు(Shops) చోటుచేసుకుంటున్నాయి. ఎదుటివారు ఎలా చనిపోతే తమకేంటనే భావనలో అనేక అన్యాయాలకు పాల్పడుతున్నారు. తినే ప్రతి వస్తువును కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) కల్తీ పాలు(Milk), కల్తీ మాంసం(Meat) పట్టుబడిన ఘటన చోటుచేసుకుంది.

తిరుపతిలోని గూడురు వద్ద అధికారులు మాంసం దుకాణాల్లో(Meat Shops) తనిఖీలు నిర్వహించగా భారీగా నిల్వ ఉంచిన మాంసం లభించింది. చాలా రోజుల నుంచి నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని(Meat) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గూడురులోని మాంసం వ్యాపారులు(Meat Business) హొటళ్లకు మాంసాన్ని సరఫరా చేస్తుంటారు. అధికారులు దాడులు చేయగా బయట పొట్టేలు మాంసం ఉండగా లోపల గొర్రె మాంసం లభించింది. భారీ మొత్తంలో కుళ్లిన మాంసాన్ని రవాణా చేస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇలాంటి ఘటనల వల్ల 208 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
మరోవైపు యాదాద్రి జిల్లా భువనగిరిలో అధికారులు దాడులు చేయగా కల్తీ పాల(Milk)ను స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ మండలం ఎల్లంబాయిలో పాల కేంద్రంపై దాడులు చేయగా 110 కల్తీ పాలు, 1 లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, 14 కిలోల మిల్క్ పౌడర్ ను అధికారులు స్వాధీనం చేసున్నారు. బాలశేఖర్ అనే పాల వ్యాపారిని అధికారులు అరెస్ట్ చేశారు.