»Rs 32 50 Lakhs As Monthly Salary To Cm Jagans Wife Anam Fire On Bharti Cements
CM JAGAN భార్యకు ప్రతి నెలా జీతంగా రూ.32.50 లక్షలు..భారతి సిమెంట్స్‌పై ఆనం ఫైర్
సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతికి ప్రతి నెలా జీతం రూపంలో భారీ మొత్తం నగదు వస్తోందని, భారతి సిమెంట్స్ ఆదాయం రూ.2 వేల కోట్లకు పెరిగిందని ఆనం వెంకటరమణా రెడ్డి అన్నారు. పేదవాడ్ని అని చెప్పుకునే జగన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సీఎం జగన్ భార్య వైఎస్ భారతికి (YS Bharati) ప్రతి నెలా జీతం రూపంలో రూ.32.50 లక్షలు అందుతాయని టీడీపీ (TDP) అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్, భారతి సిమెంట్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను పేదవాడినని చెబుతూ సీఎం జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వైఎస్ భారతికి ప్రతి నెలా 1వ తేదిన చెక్కురూపంలో భారీగా నగదు వస్తోందన్నారు.
1999లో ఫ్రెంచ్ కంపెనీ భారతి సిమెంట్స్ (Bharati cements)లో కొన్ని షేర్లను కొనుగోలు చేసిందని, ఫ్రెంచ్ కంపెనీ రూ.671 చొప్పున షేర్లను కొన్నట్లు తెలిపారు. భారతి సిమెంట్స్‌లో వాటా కొనుగోలు చేసిన ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా అందుతోందన్నారు. కానీ 49 శాతం వాటా ఉన్న వైఎస్ భారతికి ఎక్కువ జీతం వస్తోందని, ఫ్రెంచ్ కంపెనీ డైరెక్టర్‌కు మాత్రం తక్కువగా జీతం ఎందుకొస్తోందని ప్రశ్నించారు. 14 ఏళ్ల తర్వాత భారతి సిమెంట్స్ షేరు విలువ రూ.1000కి చేరిందన్నారు.
జగన్‌కు కూడా భారతి సిమెంట్స్‌లో 2.38 కోట్ల షేర్లు ఉన్నట్లు ఆనం తెలిపారు. వాటి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారంగా రూ.2,380 కోట్లు ఉన్నట్లు వివరించారు. ఎన్నికల అఫిడవిట్లో తనకు ఏమీ లేదని జగన్ చెప్పారని ఆరోపణలు చేశారు. మొత్తం మీద జగన్ దంపతులకు భారతి సిమెంట్స్‌లో రూ.4 వేల కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు ఆనం తెలిపారు. అలాగే భారతికి సిలికాన్ బిల్డర్స్‌లో 1.5 కోట్ల షేర్లు ఉన్నాయన్నాని ఆనం వెంకటరమణా రెడ్డి స్పష్టం చేశారు. 2001 నుంచి 2004 వరకూ భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని, త్రైమాసికంలో రూ.235 కోట్ల ఆదాయం ఎలా చూపిందని ప్రశ్నించారు.