చిత్తూరు జిల్లా నగరిలో సీఎం జగన్ (CMJAGAN) పర్యటన సందర్భంగా వైసీపీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గ వైసీపీ నేత KJ శాంతి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా స్థానిక ఎమ్మేల్యే జిల్లా మంత్రి రోజా (Minister Roja) ఫొటో లేకపోవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ (Cold War) గమనించిన సీఎం.. స్టేజీపైనే వారిద్దరి చేతులు కలుపుతూ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. కానీ చేతులు కలిపేందుకు ఇద్దరూ నిరాకరించారు. అసలే నగరి(Nagari)లో పరిస్థితులన్నీ రోజాకు వ్యతిరేకంగా ఉన్నాయి.
సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం కల్పించుకుని ఏదో సయోధ్య చేద్దామనుకుంటే.. దానిని కూడా రోజా కాలదన్నేసుకున్నారు. నగిరిలో సభా వేదిక(Assembly venue)పై సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి రోజా మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి (KJ Shanti) ఇద్దరి చేతులు కలిపి.. ఇక మీదట కలిసి మెలిసి ఉండాలని చెప్పారు. కానీ రోజా వింటేనా? దీంతో శాంతి సైతం తనకెందుకులే అనుకున్నట్టున్నారు. ఇద్దరూ చేతులు కలిపినట్టే కలిపి వెంటనే వెనక్కి తీసేసుకున్నారు. గత కొంత కాలం నుంచి రోజా మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి వర్గాల మధ్య వర్గ పోరు (Class struggle) బీభత్సంగా నడుస్తోంది. వీరిద్దరి మధ్య సయోధ్యకు నేడు సీఎం జగన్ యత్నించి విఫలమయ్యారు.