జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. పార్టీలో జగన్ చెప్పినట్లు పడి ఉండాలంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తిరగబడతారని హాట్ కామెంట్స్ చేసారు. పార్టీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓ రూల్, జగన్ కు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ… గదిలో రక్తపు మరకలు శుభ్రం చేసినవారికే హత్యతో ప్రమేయం ఉంటుందన్నారు.
పార్లమెంటు చట్టం ద్వారానే ఏపీ రాజధాని మార్పు సాధ్యమని కొడలి నాని గ్రహించారని వ్యాఖ్యానించారు. రాజధానిపై సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 లోకసభ స్థానాలు గెలుచుకొని కేంద్రంతో పార్లమెంట్లో బిల్లు పెట్టించి విశాఖను రాజధానిగా చేస్తామని నాని చెప్పారని గుర్తు చేశారు. అదానీ పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారని.. కానీ జగన్ తో స్నేహం తర్వాత ఆయన షేర్లు కుప్ప కూలినట్లుచెప్పారు.