Prakasam SP And Collector Came To Tadepally CM Camp Office
Balinani Srinivas Reddy: మంత్రి పదవీ పోయిన తర్వాత బాలినేని శ్రీనివాస రెడ్డికి (Balinani Srinivas Reddy) జిల్లా అధికారుల ముందు విలువలేకుండా పోయింది. కలెక్టర్, ఎస్పీ ఆయనను ఖాతరు చేయడం లేదని తెలిసింది. ఎస్పీ వైఖరి నిరసిస్తూ.. తనకు ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను కూడా బాలినేని వెనక్కి ఇచ్చేశారు. పోలీసుల తీరున నిరసిస్తూ సరెండర్ చేశారు. హైదరాబాద్ నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనం, గన్ మెన్లు లేకుండానే తాడేపల్లికి వచ్చారు.
అక్కడ సీఎంవో అధికారి ధనుంజయరెడ్డిని కలిసి సమస్యను వివరించారు. ఆ తర్వాత సీఎం జగన్ను కలిసి ఇష్యూ వివరించారు. దాంతో సీఎం జగన్ స్పందించి.. ఈ రోజు ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీని పిలిపించారు. అక్కడికి బాలినేని శ్రీనివాస రెడ్డిని కూడా పిలిపించారని తెలిసింది. ఆయన సమక్షంలోనే గొడవ సద్దుగణిగేలా చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు.
పార్టీలో విలువ లేదని ఇదివరకే బాలినేని చాలా సందర్భాల్లో చెప్పారు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదని బాధలో ఉన్నారు. దీంతో ఇష్యూను మొగ్గలోనే తుంచేయాలనే సీఎం జగన్ భావించి.. తాడేపల్లికి కలెక్టర్, ఎస్పీని పిలిచారు.