100 Hijras Came To TDP Leader Somireddy Chandramohan Protest Place
Somireddy Chandramohan Protest Place: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan) చేపట్టిన సత్యాగ్రహ దీక్ష వద్దకు భారీగా హిజ్రాలు వచ్చారు. రెండు బస్సుల్లో దాదాపు 100 మంది వరకు వచ్చారు. వారే వచ్చారా..? లేదంటే వైసీపీ నేతలు తరలించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ శ్రేణులు తరలించారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో ఓ క్వారీ నుంచి క్వార్ట్జ్ను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. దానిని అడ్డుకునేందుకు సోమిరెడ్డి (Somireddy) మూడురోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షను అడ్డుకునేందుకు అక్కడికి హిజ్రాలు వచ్చారు. వంద మంది వరకు రావడంతో సందేహాలు వచ్చాయి. అప్పటికే అక్కడ 200 మంది టీడీపీ నేతలు ఉన్నారు. సో.. వారిని హిజ్రాలు ఏమీ చేయలేదు.
అక్కడ అక్కడే తిరుగుతుండగా.. టీడీపీ నేతలు ప్రశ్నించారు. క్వారీకి దిష్టి తీసేందుకు వచ్చామని హిజ్రాలు చెప్పారు. దీంతో ఆశ్చర్యపోవడం నేతల వంతయ్యింది. క్వారీకి దిష్టి ఏంటీ అని ప్రశ్నిస్తే మాత్రం హిజ్రాల నుంచి సమాధానం రాలేదు. అప్పటికే క్వారీలో ఉన్న 12 లారీల తెల్లరాయిని అక్కడి నుంచి దాటించే కుట్ర పన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాసేపటికి సోమిరెడ్డి (Somireddy) కారుపై రాళ్లతో దాడి చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోమిరెడ్డి (Somireddy) సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని, ఇంటి వద్ద వదిలేశారు. పోలీసుల చర్యను సోమిరెడ్డి ఖండించారు.