తెలుగుదేశం పార్టీ జగనాసురా పుస్తకం పైన పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి పైన విషపు రాతలు రాసిన బుక్ కు ఆ పేరు పెట్టారని విమర్శించారు. తెలుగుదేశం నిజంగానే జాతీయ పార్టీ అన్నట్లుగా ఇంకా ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కు కూడా అధ్యక్షుడు అంట అని ఎద్దేవా చేశారు. టిడిపి మన రాష్ట్ర అధ్యక్షుడిని ఈ మాత్రం బుర్ర లేదన్నారు. అసలు జగనాసుర అనే పుస్తకంలో ఎక్కడా టీడీపీ పేరు కానీ చంద్రబాబు పేరు కానీ లేవని, వారి పేరు వేయడానికి ఎందుకు ఇంత భయమో చెప్పాలన్నారు. నిజాయితీ ఉంటే పేరు వెయ్యాలిగా అని నిలదీశారు. అసత్యాలు, విషపు రాతలు కాబట్టి పేరు లేదని పాయింట్ లాగారు. వివేకా హత్య జరిగిన సమయంలో టీడీపీ ప్రభుత్వం ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని అప్పుడు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు.
అసలు వివేకా హత్య కేసులో నాటి ప్రభుత్వం ఎందుకు చార్జీషీట్ వెయ్యలేదని ప్రశ్నించారు. అలాగే అప్పుడే అవినాష్ పేరును ఎందుకు చేర్చలేదన్నారు. ఎన్టీఆర్ చనిపోయినప్పడు కనీసం సీబీసీఐడి విచారణకు కూడా చంద్రబాబు ఇవ్వలేదని దుయ్యబాట్టారు. ఇక వివేకా హత్య జరిగిన సమయంలో అప్పటి ప్రభుత్వం లో ఎందుకు కదలిక లేకుండా పోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం విచారణ ఎందుకు చెయ్యలేదన్నారు.
అదే టిడిపి… కోడెల మరణంపై పుస్తకాన్ని ఎందుకు వెయ్యలేదన్నారు. అసలు కోడెల ఫోన్ ఎక్కడుంది… కోడెల ఫోన్ లో చంద్రబాబు గురించి ఉందా.. వీటిని బయటకు తీయలన్నారు. చంద్రబాబు అవమానాలు భరించలేక మరణిస్తున్నా అని కోడెల చెప్పాడా… తెలియాల్సి ఉందన్నారు. ఎందుకు కోడెల ఫోన్ ధ్వంసం అయిందో ఓ పుస్తకం వెయ్యాలని టిడిపికి సవాల్ చేశారు. ఎన్టీఆర్ కూతురు మరణంపై కూడా పుస్తకం వేసి సిబిఐకి అప్పగించాలన్నారు. ఎన్టీఆర్ పైనే కుట్ర పన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ కు ఎందుకు ఆ స్థితి వచ్చింది అనే దానిపై కూడా విచారణ జరిపించాలని, అలాగే పుస్తకం వేయాలని డిమాండ్ చేశారు.