కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన చేశారు. తనను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ సంపాదించలేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా రౌతులపూడిలో పర్యటనకు వచ్చిన ఆయన తన రాజకీయ భవిష్యత్తు గురించి కీలక ప్రకటన చేశారు. తాను కూడా ఇంతవరకు ఏ పార్టీని సంప్రదించలేదని తెలిపారు. అయితే త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరతానని విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.
ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్ధులను ప్రకటించే పనిలో నిమగ్నమైన సీఎం జగన్ త్వరలోనే పద్మనాభం అభ్యర్ధిత్వాన్ని కూడా ఖరారు చేస్తారని వైసీపీ వర్గాల సమాచారం. ఏడాది క్రితమే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళతారనే రూమర్లు వచ్చాయి. తాజాగా ఎంపీ మిథున్‌రెడ్డితో ఆయన జరిపిన చర్చలు ఈ రూమర్లకు బలం చేకూరుస్తున్నాయి. ముద్రగడ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. కాకినాడ పార్లమెంట్ నుంచి కానీ, పెద్దాపురం ఎమ్మెల్యేగా కానీ ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.