KRNL: గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్లో మానసిక ఆరోగ్య విభాగాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి సోమవారం తనిఖీ చేశారు. మానసిక వికలాంగులకు న్యాయ సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ఎల్ఎస్యూఎం కమిటీ వివరాలను వెల్లడించారు. వారితో మాట్లాడి హక్కులపై అవగాహన కలిగించారు.
SKLM: లావేరు మండలంలోని చినమురపాకలో రెవిన్యూ శాఖ నిర్వహించిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సోమవారం ఎమ్మెల్యే ఈశ్వరరావు హాజరై కార్డులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పధకాలను అమలు చేస్తున్నారన్నారు. ఎచ్చెర్ల ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిచేలా పని చేస్తామన్నారు.
NLR: ముత్తుకూరు మండలం కప్పలదొరువు వద్ద ప్రణీత్ ఆథరైజ్డ్ ఫిట్ నెస్ (ఏటీఎస్) సెంటరును సోమవారం సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని కమర్షియల్ వాహనాల ఫిట్ నెస్‌ను అత్యాధునిక విధానంలో 30 పరీక్షలు చేసి సర్డిఫికేట్ జారీ చేసే తనిఖీ కేంద్రం సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తెలిపారు.
ప్రకాశం: సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి రూపశ్రీ కోరారు. సోమవారం కోర్టు ఆవరణలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోని కేసులను పరిష్కరించుకోనే విధంగా పోలీస్‌లు కృషి చేయాలని తెలిపారు.
KDP: పులివెందుల పట్టణంలోని కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ ఎలక్ట్రికల్ షాప్ ఉన్న తనపై కొంతమంది దాడి చేసినట్లు యూ ట్యూబర్ ఆదిశేషు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లడారు. నాపై తుమ్మలపల్లికి చెందిన టీడీపీ నాయకుడు విశ్వనాథరెడ్డి, అతని అనుచరులు పైపుతో దాడి చేశారన్నారు. కాగా, ఈ దాడిలో నా చెయ్యి విరగడంతోపాటు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి అని ఆయన పోలీసుల ఫిర్యాదు చేశారు.
E.G: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు అన్నారు. సోమవారం సాయంత్రం తాళ్లపూడి మండలం తాడిపూడిలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో వైసీపీ ఇచ్చిన వికలాంగుల ఫించన్లును నిబంధనలు పేరిట కూటమి ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు.
SKLM: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ఎం.అవతారం, ఎస్సై చిరంజీవి తెలిపారు. సోమవారం జె.ఆర్ పురం పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పైడి భీమవరంలో గంజాయి విక్రయిస్తున్న 10 మందిని అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
తూ.గో: రాజమండ్రి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన పీ.జీ.ఆర్.ఎస్–మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 19 అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరించి పూర్తి స్థాయి న్యాయం చేయాలని డివిజన్ స్థాయి అధికారులకు ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ సూచించారు. ప్రతి అర్జీని నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
చిత్తూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినుతల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జాయింట్ కలెక్టర్ జి. విద్యాదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 359 అర్జీలను స్వీకరించారు.
CTR: వినాయక చవితి నేపథ్యంలో పలమనేరు పోలీసులు ఐదు మందిని బైండోవర్ చేసినట్లు సీఐ నరసింహారాజు తెలిపారు. గతేడాది చవితి సందర్భంగా గొడవలు పడ్డ పలువురిని డీఎస్పీ ప్రభాకర్ ఎదుట హాజరుపరిచి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. అనంతరం వీరిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. కాగా, చవితి సందర్భంగా ఎవరైనా గొడవలు పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోనసీమ: నిరుద్యోగ యువతకు మంత్రి సుభాష్ శుభవార్త అందించారు. ఓఎన్జీసీ రాజమండ్రిలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద 12 నెలల ఇంటర్న్‌షిప్ పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ప్రభుత్వం నుండి నెలకు రూ.5,000, పరిశ్రమ నుండి వసతి కోసం రూ. 10,000 ఆర్థిక సహాయం లభిస్తుందని పేర్కొన్నారు. వివరాల కోసం రామచంద్రపురం టీడీపీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
సత్యసాయి: కదిరిలో వెలసిన ఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు దర్శించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆయనను ఆశీర్వదించారు. ఆయన వెంట టీడీపీ నేతలు ఉన్నారు.
KDP: రాజ్యసభ సభ్యుడు YCP నేత మేడా రఘునాథరెడ్డిపై కొన్ని ఛానల్లు దుష్ప్రచారం చేయడం తగదని YCP రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరీ రెడ్డి మండిపడ్డారు. కడపలో ఆమె మాట్లాడుతూ.. YS జగన్ అంటే మేడాకు వారి కుటుంబానికి ఎంతో అభిమానం, ప్రేమ అని గుర్తు చేశారు. ప్రాణం ఉన్నంత వరకు మేడా రఘునాధరెడ్డి వారి కుటుంబం వైఎస్ జగన్‌ను వీడరని స్పష్టం చేశారు.
ప్రకాశం: పొదిలి మండలం కుంచెపల్లి గ్రామంలో యాక్సెస్ టు జస్టిస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ సోషల్ వర్కర్ ఎం. అభిషిక్త మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే సమస్యలను వివరించారు. చట్ట ప్రకారం బాల్య వివాహాలు నేరమని, ఇందులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొన్న వారందరూ నేరస్తులేనని తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆయన గోడౌన్లోని భద్రతా చర్యలను పరిశీలించారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించిన కలెక్టర్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి సంతకం చేశారు.