అన్నమయ్య: రాయచోటి పట్టణం టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం PTM పల్లె అభిమానులు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. సత్కారంలో పాలకొండ్రాయుడు గారి చిత్ర పఠం అందజేసి, శాలువ కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు, అభిమానులు హాజరయ్యారు.
W.G: ఆకివీడులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆకివీడు శివారు గాలిబ్ చెరువు ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై సీఐ వి. జగదీశ్వరరావు మెరుపుదాడి నిర్వహించారు. వీరి వద్ద నుంచి రూ. 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆకివీడు ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని సీఐ స్పష్టం చేశారు.
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఉ.9 గంటలకు నెల్లిమర్లలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలుతో కలసి పాల్గొనున్నారు.అనంతరం 10:30 నుండి అశోక్ బంగ్లాలో జిల్లా టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు.
SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నది పక్కన చరిత్ర కలిగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి భాద్రపద విదియ సోమవారం ధూపాలంకరణతో పాతకాల దర్శనం ఇచ్చారు. పాతపట్నంతో పాటు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన గజపతి జిల్లా ప్రజలు సోమవారం తెల్లవారుజామునే నీలకంఠేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు, కారు ఢీకొనడంతో బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు ప్రతి మండల కేంద్రం, రేపల్లె, చీరాల ఆర్డీవో కార్యాలయాల వద్ద పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.
ATP: గుత్తి మీదుగా సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు గుంతకల్లు డివిజన్ అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి గురువారం సికింద్రాబాదులో బయలుదేరే రైలు (07009) డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల మీదుగా తిరుపతికి చేరుతుంది. తిరుగు రైలు (07010) శుక్రవారం బయలుదేరి అదే మార్గంలో సికింద్రాబాదుకు చేరుతుంది.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పలు స్వచ్ఛంద సంస్థలు ఆదివారం వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాగోలు గ్రామం, దూసి రోడ్డు జంక్షన్ వద్ద లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వారు 1000 మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ = ఎన్విరాన్మెంట్ ఛైర్మన్ పొన్నాడ రవి మాట్లాడుతూ.. పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాలు మేలు అని అన్నారు.
KDP: కలెక్టరేట్‌లోని సభా భవనంలో నేడు(సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపల్ స్థాయిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం ఉంటుందన్నారు. 08562-244437 నంబరుకు కాల్ చేయవచ్చన్నారు.
CTR: గుడిపాల మండలంలోని వసంతాపురం సచివాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయాధికారి సంగీత తెలిపారు. సచివాలయానికి 300 బ్యాగులు వచ్చాయన్నారు. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.
GNTR: నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం జరగనుంది. ప్రజలు 0863-2224202 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా కమిషనర్ పులి శ్రీనివాసులుకు తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమం తరువాత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
ATP: తాడిపత్రి పట్టణ రూరల్ పరిధిలోని లాడ్జీలలో పోలీసులు ఆదివారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. రూరల్ ఎస్సై శివగంగాధర్ రెడ్డి సిబ్బందితో కలిసి లాడ్జీలను పరిశీలించారు కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించారు. అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
AKP: అనకాపల్లి జిల్లా పోలీసులు ఆదివారం ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ‘సండేస్ ఆన్ సైకిల్’ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏఆర్ డీఎస్పీ పీ.నాగేశ్వరరావు ఈ ర్యాలీని ప్రారంభించారు. విశాఖలోని ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయం నుంచి సాగర్‌నగర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
PPM: సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవడం వల్ల శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా ఆరోగ్యం మరింతగా మెరుగు పడుతుందని కొమరాడ ఎస్సై నీలకంఠం అన్నారు. ఆదివారం కొమరాడ మండల కేంద్రంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు.
TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి దగ్గర కోడి పందేలు నిర్వహించారు. పోలీసులు డ్రోన్ కెమెరాతో కోడిపందెం ఆడేవారిని గుర్తించారు. పోలీసుల రాకను పసిగట్టిన పలువురు పరుగులు తీశారు. ఈ మేరకు పోలీసులు వెంబడించి 21 మందిని పట్టుకోగా మరికొందరు పరారయ్యారు. కాగా, 11 కోడిపుంజులు, రూ.61116, 29, 30 బైకులు, కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు.