NLR: చేజర్ల మండలం నాగులవెల్లటూరు జడ్పీ హైస్కూల్‌లో బయాలజీ సైన్స్ టీచర్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి వెళ్లింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులతో మాట్లాడిన అధికారులు సమస్యను వివరంగా తెలుసుకున్నారు. తాత్కాలికంగా బయాలజీ సైన్స్ టీచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
మన్యం: తక్షణమే జిల్లాకు రెగ్యులర్ డీఈవో, పార్వతీపురం ITDAకు రెగ్యులర్ డీడీను నియమించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. MEO, మరొకరు ATWOలు వీరి నిర్లక్ష్యం, పనితీరు వల్ల పూర్తిగా జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగం నాశనం అవుతుందన్నారు.
KDP: పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో సోమవారం శ్రమదానం నిర్వహించారు. పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో బి. కాం చదివే విద్యార్థులు ఆలయ పరిసరాలు శుభ్రం చేశారు. ఈ మేరకు విద్యార్థుల శ్రమను ఆలయ ఈవో వెంకట రమణ అభినందించారు. కాగా, విద్యార్థులకు శ్రీ రంగనాథ స్వామి చరిత్ర పుస్తకాలు అందించారు.
విశాఖ ఎంపీ శ్రీ భరత్ సోమవారం చిన్న వాల్తేరు రైల్వే గెస్ట్ హౌస్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం శ్రీ సందీప్ మాధుర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, కొత్త రైళ్లు, ఆధునిక సదుపాయాలపై చర్చించి రైల్వే ప్రాజెక్టులు వేగవంతం కావాలని కోరారు. జీఎం పూర్తి సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు.
SKLM: బూర్జ మండలంలోని పనుకుపర్త నుంచి అల్లెన బిటి రోడ్డు మధ్య ఉన్న మట్టి రోడ్డు వర్షాలకు బురదమయంగా తయారయ్యింది. దీంతో నిత్యం అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా పణుకుపర్త గ్రామం మీదుగానే పాలవలస జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లే అల్లెన, జీ.బీ పురం కిల్లంతర, వైపర్త విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు.
TPT: రామచంద్రాపురం మండలం కేకేవీపురంలో సోమవారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 9,611 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయని, అందరికి వారి ఇంటి వద్దనే గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్లి పంపిణీ చేస్తారని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండదని పేర్కొన్నారు.
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని SE కట్టా వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం ఒంగోలులోని తన కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో రూ.కోట్ల మేరా విద్యుత్ బకాయిలు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ బకాయిలు విద్యుత్ సంస్థకు పెను భారంగా మారాయని గుర్తుచేశారు. గడువులోపు బిల్లులు చెల్లిస్తే పెనాల్టీ, సర్‌ఛర్జ్ కట్టకుండా లబ్ది పోందవచ్చన్నారు.
KDP: పులివెందుల పట్టణంలోని ఎరువుల దుకాణాలను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలను, ఎరువుల బస్తాలను, ఎరువుల ధరలను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి, పోలీసులతో వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎరువుల దుకాణాల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.
SKLM: బూర్జ మండలం పెద్దపేట హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్‌లో ‘షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక పథకం’ ద్వారా రైతులకు చిరుధాన్యాలు, గడ్డపార, గునపాం,స్పేయర్లు మొదలగు ఉపయోగపడే పరికరాల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగింది. రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు ఈ కార్యాక్రంలో పాల్గొని పరికరాలను రైతులకు అందజేశారు.
KRNL: కోడుమూరులో నిర్వహించిన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ కార్యక్రమానికి MLA బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా PM మోదీ, CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు.
VSP: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2025కు దేశవ్యాప్తంగా 45 మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. విశాఖకు చెందిన తిరుమల శ్రీదేవి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. అవార్డుతో పాటు రూ.50 వేలు, వెండి పతకం అందజేస్తారు. విశాఖకు చెందిన ఉపాధ్యాయురాలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించినందుకు పలువురు అభినందనలు తెలిపారు.
VZM: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్సై గణేష్ వెల్లడించారు. నెల్లిమర్ల మండలంలోని సతివాడలోని జెటిఎన్ఎం కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో భాగంగా సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో గొప్పవారు కావాలని కళాశాలకు పంపుతారని చెప్పారు.
KRNL: నగర ప్రజల భాగస్వామ్యంతో కర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని నగర మేయర్ B.Y రామయ్య అన్నారు. ఈ నెల 2న అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ సర్వసభ్య సమావేశాన్ని తిరిగి సోమవారం నిర్వహించారు. మొత్తం 15 తీర్మానాలను ఆమోదించారు. రూ.4.06 కోట్ల విలువ గల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అదేవిధంగా నగరంలో రహదారులు, డ్రైనేజీ వంటి పలు తీర్మానాలను ఆమోదించారు.
W.G: యలమంచిలిలోని నేరేడుమిల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు ఉచ్చుల స్టాలిన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీ, మండల కమిటీ, అనుబంధ విభాగాల కమిటీల నియామకం, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహణ, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు స్టాలిన్ బాబు తెలిపారు.
AKP: మాడుగులలో విశాఖ డైరీ పాల సొసైటీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో సొసైటీ అధ్యక్షురాలిగా బండారు వరలక్ష్మి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శి జోగి నాయుడు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. బొడ్డేటి నాగరాజు, వేచాలపు అప్పారావు సొసైటీ డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. వీరు మూడేళ్లపాటు సేవలందించనున్నారు.