• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కుటుంబానికి నాలుగేళ్ల దూరం.. ఫలితంగా 3 ఉద్యోగాలు

CTR: పెనుమూరు మండలం కత్తిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుజాత DSC SA తెలుగులో 85.29 మార్కులతో ఓసీ కేటగిరిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచారు. అలాగే TGTలో 76.86 మార్కులతో 16వ స్థానం, పీజీటీలో 78 మార్కులు సాధించి 21వ ర్యాంకు సాధించారు. ఈమెనాలుగేళ్లుగా పిల్లల్ని, కుటుంబాన్ని వదిలి నంద్యాలలో కోచింగ్ తీసుకుంటున్నారు. నాలుగేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

August 24, 2025 / 07:29 AM IST

రేవు నిర్మాణ పనులకు రూ. 5 లక్షలు మంజూరు

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని చింతరేవు స్మశానం వద్ద స్నానాలు రేవు నిర్మాణకి మండల పరిషత్ 15 ఫైనాన్స్ నిధులు రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. నిధులతో రేవు నిర్మాణ పనులు శనివారం సర్పంచ్ అడ్డాల సూరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుమనీ స్వామి, పంచాయతీ కార్యదర్శి ఎం. సత్యనారాయణ, సిబ్బంది, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

August 24, 2025 / 07:24 AM IST

హాస్టల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

KRNL: తుగ్గలి మండల పరిధిలోని ప్రభుత్వ (ఎస్‌డబ్ల్యూ) బాలుర వసతి గృహం విద్యార్థులకు జైయింట్ స్ఫూన్ మార్కెట్ లిమిటెడ్ బృందం సభ్యుల ఆధ్వర్యంలో శనివారం పెన్నులు, లాంగ్ నోట్ పుస్తకాలు, బ్యాగ్స్ అందజేశారు. జీఎస్ఎమ్ సిబ్బంది మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదవి తల్లిదండ్రులుకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

August 24, 2025 / 07:22 AM IST

ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్

SKLM: గరుడ ఖండి గ్రామానికి చెందిన నిఖిలేష్, గజపతి జిల్లా కాశీ నగరం వాసి టి.కార్తికేయ అనే ఇద్దరు బైక్ దొంగలను కాశీబుగ్గ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరు వ్యసనాలకు బానిసై బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని కాశి బుగ్ డీఎస్పీ వి. వెంకట అప్పారావు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నమన్నారు.

August 24, 2025 / 07:20 AM IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆటో

SKLM: పొందూరు మండలం గోరింట గ్రామ సమీపంలో శనివారం ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. పెనుబర్తి ఐఆర్ కాలనీకి చెందిన మడపాన రాజశేఖర్ ద్విచక్ర వాహనంపై గోరింట వైపు వెళుతుండగా పొందూరు నుంచి వస్తున్న ఆటో బలంగా ఢీకొంది దీంతో రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు కాళ్లు చేతులు విరిగిపోయాయి.

August 24, 2025 / 07:19 AM IST

ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు కన్నుమూత

ASR: ప్రముఖ ఆదివాసీ ఉద్యమకారుడు, దండకారణ్య విమోచన సమితి(డీఎల్ఎ) వ్యవస్థాపకుడు చెండా ఏలియా(65) శనివారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉపాధ్యాయ వృత్తిలో కొంతకాలం పనిచేసిన ఆయన, అనంతరం ఆదివాసీ హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడారు.

August 24, 2025 / 07:16 AM IST

కైకలూరులో 29న మెగా జాబ్ మేళా

ELR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న కైకలూరులోని ట్రావెలర్స్ బంగ్లాలో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10, ఇంటర్,డిగ్రీ, బి.టెక్ పూర్తిచేసిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలన్నారు. 10 కంపెనీలకు పైగా ప్రతినిధులు పాల్గొంటారన్నారు.

August 24, 2025 / 07:16 AM IST

మ్యాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం

కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్మించిన మ్యాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్‌ను శనివారం ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ మ్యాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం రావడం వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

August 24, 2025 / 07:09 AM IST

గోపాలపురంలో నేటి చికెన్ ధరలు

E.G: గోపాలపురంలో ఆదివారం చికెన్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఈ వారం బ్రాయిలర్ చికెన్ ధర కిలో రూ.200 నుంచి రూ.220 వరకు పలికింది. స్కిన్ లెస్ చికెన్ రూ.240, ఫారం మాంసం రూ.200, నాటుకోడి మాంసం రూ.400కు విక్రయించారు. దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంతో కామెంట్ చేయండి.

August 24, 2025 / 07:07 AM IST

ఎత్తైనశిఖరాన్ని అధిరోహించిన తిరుపతి డీఎస్పీ

TPT: చిత్తూరు ఎస్పీ మణికంఠ సతీమణి, తిరుపతి రైల్వే డీఎస్పీ హర్షిత యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైనశిఖరాన్ని అధిరోహించి పోలీస్ శాఖకు గుర్తింపు తెచ్చారు. మౌంట్ ఎల్ బ్రస్ శిఖరాన్ని 5,642 మీటర్లు సునాయాసంగా అధిరోహించి విజయానికి చిహ్నంగా జాతీయ జెండాచూపారు. కఠోర శ్రమ.. భర్త ప్రోత్సాహమే తనను ఇంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించేలా చేసిందన్నారు.

August 24, 2025 / 07:03 AM IST

29న విశాఖ‌కు సీఎం చంద్రబాబు

VSP: ఈ నెల 29న సీఎం చంద్ర‌బాబు విశాఖకు రానున్నారని జిల్లా అధికారులు తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి నోవాటెల్‌కు వెళ్తారు. డబుల్ డెక్కర్ బస్సులు, వీఎంఆర్డీఏ కాంప్లెక్స్‌లను సీఎం ప్రారంభిస్తారు. శాప్ నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ కప్ ఫైనల్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేస్తారు.

August 24, 2025 / 07:01 AM IST

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై బీసీవై హెచ్చరిక

GNTR: తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని విమర్శించారు. ఎన్టీఆర్ గొప్ప నటుడే కాని ఆయనను శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించడం హిందువుల, యాదవుల మనోభావాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేశారు.

August 24, 2025 / 07:00 AM IST

భోగాపురంలో రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్

VZM: భోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్ శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ.. కొత్తగా వ్యాపారవేత్తలుగా ఎదగదలచిన వారికి ఈ వర్క్‌‌షాప్ ప్లాట్ ఫాంలు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు, రిజిస్ట్రేషన్లు, సబ్సిడీలు వంటి అంశాలపై ఆమె అవగాహన కల్పించారు.

August 24, 2025 / 06:59 AM IST

దివ్యాంగులకు సహాయక బూత్‌లు ఏర్పాటు

విశాఖ వాల్తేరు రైల్వే డివిజన్ దివ్యాంగుల ప్రయాణ సౌలభ్యం కోసం శనివారం ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ వంటి ప్రధాన స్టేషన్లలో ‘దివ్యాంగ సహాయకుల’తో సహాయక బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ బూత్‌ల ద్వారా వీల్‌చైర్లు, చేతి కర్రలు వంటి సహాయక పరికరాలను ఉచితంగా అందించనుంది.

August 24, 2025 / 06:58 AM IST

టంగుటూరికి నివాళులు అర్పించిన ఎస్పీ దామోదర్

ప్రకాశం: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు తెలుగు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ టంగుటూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఎస్పీ కార్యాలయంలోని పోలీసు సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

August 24, 2025 / 06:56 AM IST