ASR: ప్రముఖ ఆదివాసీ ఉద్యమకారుడు, దండకారణ్య విమోచన సమితి(డీఎల్ఎ) వ్యవస్థాపకుడు చెండా ఏలియా(65) శనివారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉపాధ్యాయ వృత్తిలో కొంతకాలం పనిచేసిన ఆయన, అనంతరం ఆదివాసీ హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడారు.