• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డు లేక కానూరులో ఇబ్బందులు

NTR: విజయవాడ అర్బన్ ఏరియాలోని కానూరు, పింగళి వెంకయ్య మార్గ్ (పీవీఎం)లోని రెండు వీధుల ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తే నెల రోజుల వరకు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. వీధుల్లో నిలిచిపోయిన నీటి కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

August 25, 2025 / 12:55 PM IST

కాకాణి గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యేసంజీవయ్య భేటీ

TPT: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటీవల జైలు నుంచి విడుదలైన సందర్భంగా సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించుకున్నారు.

August 25, 2025 / 12:54 PM IST

నిడిజీవిలో ప్రమాదం.. ఒకరికి గాయాలు

KDP: ఎర్రగుంట్ల మండలం నిడిజీవి సమీపంలో సోమవారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న కారు రోడ్డు పక్కన ఆగింది. చిలమకూరు నుంచి ఎర్రగుంట్లకు వెళ్తున్న ఆటో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో చిలుమకూరుకు చెందిన ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. దీంతో ముద్దనూరు 108 వాహన సిబ్బంది ప్రొద్దుటూరు హాస్పిటల్‌కు తరలించారు.

August 25, 2025 / 12:50 PM IST

జిల్లాలో నూతన ఆర్టీసీ బస్టాండ్‌కు శంకుస్థాపన

W.G: ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సు రావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అదే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం చిన అమిరం గ్రామ పంచాయతీ ఎస్ఆర్ కేఆర్ కళాశాల ఎదురుగా ఆర్టీసీ బస్టాండ్‌కు ఇవాళ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో హాస్పిటల్ సహకారంతో నూతన బస్టాండ్‌ను నిర్మించడం అభినందనీయమన్నారు.

August 25, 2025 / 12:49 PM IST

మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన కలెక్టర్

సత్యసాయి: జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సోమవారం కలెక్టరేట్‌లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి ప్రజలు ప్లాస్టిక్ విగ్రహాలను వాడకూడదని, మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కాలుష్య నియంత్రణ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యావరణ హిత పండుగకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

August 25, 2025 / 12:48 PM IST

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎంఈవో

SKLM: నరసన్నపేట మండలం లకిమేర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో- 2 పేడాడ దాలినాయుడు సందర్శించారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థులతో మమేకమై వారి సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సామర్థ్యాలు పెరిగే విధంగా ఉపాధ్యాయులు బోధన సామర్ధ్యాలు పెంచాలని సూచించారు. అనంతరం పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు.

August 25, 2025 / 12:45 PM IST

వైభవంగా సీతారాముల కళ్యాణం

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని రంగ మండపంలో సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులకు TTD వేద పండితులు, అర్చకులు అభిషేకాలు చేశారు. ఆ తర్వాత కళ్యాణోత్సవం జరిపించారు. కళ్యాణోత్సవం చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

August 25, 2025 / 12:45 PM IST

జిల్లాలో 5,85,615 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు

GNTR: జిల్లాలోని 5,85,615 కుటుంబాలకు ఈ నెల 30 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదలవుతుంది. ఏటీఎమ్ కార్డు మాదిరిగా, క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ఈ కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేస్తారనీ సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

August 25, 2025 / 12:44 PM IST

ఎంపీ నిధులతో ఆర్టీసి ప్రయాణికులకు ఉచిత మినరల్ వాటర్

NDL: ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ నిధులతో ఆర్టీసి కార్మికులు, ఉద్యోగులు, ప్రయాణికుల సౌకర్యం కోసం ఉచిత మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం చెపట్టారు. సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, రీజనల్ మేనేజర్ రజియా సుల్తాన సోమవారం మాట్లాడతూ.. ఆర్టీసి బస్టాండ్ ప్రాంగణంలో ఎంపీ నిధులతో చేపట్టే ప్లాంటును అందరు బాద్యతో ఉపయోగించుకోవాలని తెలిపారు.

August 25, 2025 / 12:44 PM IST

అల్లిపురంలో రూ.1.44 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపన

GVMC 33వ వార్డ్ అల్లిపురంలో సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ, మేయర్ పీలా శ్రీనివాస్తో కలిసి సోమవారం రూ.1.44 కోట్లతో చేపట్టిన బీటీ రహదారి, డ్రైనెజ్ పనులకు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి, నీటి నిల్వ సమస్యల నివారణకే ఈ పనులు ప్రారంభించామన్నారు.

August 25, 2025 / 12:43 PM IST

కిక్కిరిసిన బోయకొండ క్షేత్రం

CTR: చౌడేపల్లె ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

August 25, 2025 / 12:40 PM IST

గిరిజన వసతి గృహంలో టైఫాయిడ్ కలకలం

ERL: జంగారెడ్డిగూడెం గిరిజన సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహంలో టైఫాయిడ్ కలకలం రేగింది. ఇంటర్, వృత్తి విద్యా కళాశాలల్లో డీఎంఎల్డీ, ఎంఫీహెచ్ డబ్ల్యూ కోర్సులు చేస్తున్న 13 మంది విద్యార్థినులు జ్వరంతో బాధపడ్డారు. వీరికి ఆదివారం ప్రాంతీయ ఆసుపత్రిలో పరీక్షలు చేయగా టైఫాయిడ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు HM తెలిపారు.

August 25, 2025 / 12:37 PM IST

రౌడీ షీటర్లకు సీఐ రాజశేఖర్ కౌన్సిలింగ్

KRNL: ఆదోని రెండో పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి రౌడీ షీటర్లకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అల్లరిమూకల సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

August 25, 2025 / 12:36 PM IST

అడపవలస గ్రామంలో ఏకగ్రీవంగా పెసా కమిటీ ఎన్నిక

ASR: డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ అడపవలస గ్రామంలో ఎన్నికల అధికారిణి జే.కళావతి ఆధ్వర్యంలో సోమవారం పెసా కమిటీ ఎన్నిక నిర్వహించారు. తామర్ల సూర్య నారాయణ పెసా కమిటీ ఉపాధ్యక్షుడుగా, చెడ్డా రామ్మూర్తి పెసా కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికల అధికారిణి జే.కళావతి వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు.

August 25, 2025 / 12:27 PM IST

ఏలేరు బల్లకట్టు వద్ద మళ్ళీ గండి

KKD: గొల్లప్రోలులో బల్లకట్టుకు గత వరదలకు పడిన భారీ గండిని ఇటీవల ఇసుక బస్తాలతో తాత్కాలికంగా రింగ్ బండ్ నిర్మించి పూడ్చారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఏలేరు నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో ఇసుక బస్తాల్లో కొన్ని కొట్టుకుపోయి మళ్లీ గండిపడింది. ఈ నేపథ్యంలో నీరు వృథాగా కిందికి పోతోంది. గండిని త్వరగా పూడ్చకపోతే వ్యవసాయానికి నీరు అందదని రైతులు వాపోతున్నారు.

August 25, 2025 / 12:24 PM IST