సత్యసాయి: జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సోమవారం కలెక్టరేట్లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి ప్రజలు ప్లాస్టిక్ విగ్రహాలను వాడకూడదని, మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కాలుష్య నియంత్రణ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యావరణ హిత పండుగకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.