కృష్ణా: కంకిపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. 20 మందిలో కేవలం నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 24 గంటల ముందే సమాచారం ఇస్తుండటంతో హాజరుకాలేకపోతున్నామని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరతపై అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎస్సీ కాలనీలో ప్రహరిగోడకు నిధులు కేటాయించాలని సభ్యులు కోరారు.
మన్యం: జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పార్వతీపురం ఎఎస్పీ అంకితా సురనా సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఆర్జీదారులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు.
NDL: నెల్లూరుకు చెందిన అచ్యుత వేంకట సాయి మాధవ శశాంక్ కుటుంబ సభ్యులు శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారికి సోమవారం మూడు బంగారు హారాలు సమర్పించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. పగడాలు, ముత్యాలు, కెంపులతో ఉన్న ఈ మూడు హారాల బరువు 232 గ్రాములు అని చెప్పారు. బంగారు హారాలు సమర్పించిన దాతలకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
ప్రకాశం: పొదిలిలో విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రికార్డులు పరిశీలించిన అధికారులు విశ్వనాధపురంలోని ఓ ఎరువుల దుకాణదారుడిపై కేసు నమోదు చేసి, అక్రమంగా నిల్వఉంచిన రూ.20 లక్షలు విలువచేసే 1704 బస్తాల ఎరువులను అధికారులు సీజ్ చేశారు. ఏవో మాట్లాడుతూ.. కృత్రిమ ఎరువుల కొరత సృష్టించేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సత్యసాయి: పెనుకొండ మండలంలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఏర్పాటు చేయాలని నియోజకవర్గం ఈడిగ (గౌడ) కులస్తులు మంత్రి సవితకు సోమవారం వినతి పత్రం అందించారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ.. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించాలని విగ్రహం తప్పకుండా ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
BPT: కొరిశపాడులోని వెలుగు కార్యాలయంలో వెలుగు ఏపీవో గాయత్రి లక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం అక్షరాంధ్ర, అక్షరాస్యత కార్యక్రమంపై ఎఫ్ఏ, వివోఏ, వాలంటరీ లకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య కన్వీనర్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. మండలంలో మహిళలను గుర్తించి ప్రతి పదిమందికి ఒక వాలంటరీలను ఏర్పాటు చేస్తామన్నారు.
PLD: పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కారం కల్పించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులో పరిష్కారం కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.
E.G: గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టాయని, కానీ కూటమి కూటమి ప్రభుత్వం పేదల కడుపు నింపేందుకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. సోమవారం సాయంత్రం రాజమండ్రి 94వ డివిజన్ పరిధిలోని రేషన్ షాపు వద్ద లబ్దిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ కార్డుల వల్ల రేషన్ పంపిణీ పారదర్శకంగా జరుగుతుందన్నారు.
NLR: విడవలూరు మండలానికి చెందిన లక్ష్మీ అనే మహిళ డీఎస్సీలో నాలుగు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి “స్త్రీ శక్తి” విజయోత్సవ సభలో ఆమెను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, కృషి పట్టుదల వల్ల ఈ ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమనికి వచ్చిన మహిళలు లక్ష్మిని అభినందించారు
GNTR: తడి-పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు వేరుగా చేసి చెత్త ఆటోలలో వేయాలని మంగళగిరి నగర కమిషనర్ అలీం బాషా తెలిపారు. సోమవారం ఆయన నగరపాలక సంస్థ అధికారులతో కలిసి నగరంలోని క్లాప్ ఆటోల ద్వారా వచ్చే చెత్త డోర్ టు డోర్ సేకరణను పరిశీలించారు. పలు వార్డులలో తడి-పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు వేరుగా అందించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
E.G: రాజమండ్రిలో వినాయక చవితి సందడి నెలకొంది. సోమవారం సాయంత్రం నుండి వివిధ పరిమాణాల్లో, వివిధ ఆకృతుల్లో తయారు చేసిన గణనాథుని ప్రతిమలను అమ్మకాలు ప్రారంభించారు. దీంతో రాజమండ్రి నగరంలోని మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్, దేవి చౌక్, కంబాల చెరువు ప్రాంతాల్లో కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది. రాజమండ్రి నగరం నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా గణనాథులను కొనుగోలు చేస్తున్నారు.
ప్రకాశం: పొదిలి పరిధిలోని విశ్వనాథపురానికి చెందిన పొట్లపాటి మంజుల ఇటీవల ప్రకటించిన DSC ఫలితాల్లో ఒకేసారి మూడు ఉద్యోగాలకు అర్హత సాధించింది టీజీటీ సైన్స్‌లో ఆరో ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో 18వ ర్యాంకు, టీజీటీ బయాలజీలో 20వ ర్యాంకు సాధించింది. ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికైన పొట్లపాటి మంజుకు ఎమ్మార్పీఎస్ నాయకులు, బంధుమిత్రులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.
VZM: బాడంగి మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆనవరం గ్రామానికి చెందిన 100 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి బొబ్బిలి కోటలో సోమవారం ఎమ్మెల్యే బేబినాయన సమక్షంలో టీడీపీలో చేరాయి. వీరందరికి బేబినాయన కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు.
SKLM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించిన పలు రకాల సమస్యల పరిష్కారం కోసం చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ నియోజకవర్గ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని తెలియజేశారని ఎంపీ తెలిపారు.
W.G: తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెంలో సహజీవనం చేస్తున్న ముప్పిడి కుమారిని అనుమానంతో హత్య చేసిన చవలపాటి శ్రీనుకు తాడేపల్లిగూడెం 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా జీవితకాల కఠిన కారాగార శిక్ష, 10,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. 2018 జులై 4న శ్రీను, కుమారిని మంచం చెక్కతో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.