W.G: వైసీపీ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పెంటపాడు మండలంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తీసేస్తాం.. వేసేస్తాం అంటే చూస్తూ ఊరుకునే కార్యకర్తలు ఎవరూ లేరన్నారు. కొట్టును లేపేయడానికి కత్తులు, కఠారుల అవసరం లేదని, కూటమి కార్యకర్తల వైపు చూస్తే కంటి చూపుతో లేపేస్తామన్నారు.
ATP: డీఎస్సీ-25కు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 28న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్, జిల్లా పరిశీలకులు సుబ్బా రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. ప్రసాద్ బాబు తెలిపారు. ఆలమూరు రోడ్డులో ఉన్న బాలాజీ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని సోమవారం జిల్లా పరిశీలకులు సుబ్బారావు పరిశీలించారు.
ELR: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 28న ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు DEO వెంకట లక్ష్మమ్మ సోమవారం తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, 3 గెజిటెడ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, 5 పాస్ పొర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాలన్నారు.
సత్యసాయి: అగళి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం రేషన్ డీలర్లతో తహశీల్దార్ సుబ్బారావు సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ లోపు బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. తూకాల్లో తప్పుదల లేకుండా చూడాలని, బయటకు వెళ్లాల్సిన సందర్భంలో ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ELR: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం ముదినేపల్లి మండలం కోడూరులో ఆయన పర్యటించారు. అనంతరం రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
W.G: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 29న తణుకులో 2K రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంకు సూర్య నారాయణ తెలిపారు. ఉదయం 6 గంటలకు తణుకు చిట్టూరి ఇంద్రయ్య కళాశాల వద్ద 2K రన్ ప్రారంభమవుతుందని చెప్పారు. అండర్ 12, 14, 17, 20, 20 బాలుర, బాలికల విభాగాలు ఉంటాయన్నారు. ప్రతి కేటగిరిలో బహుమతులు అందిస్తామన్నారు.
KKD: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం సందర్భంగా అన్నవరం దేవస్థానంలో ఆరోజు మధ్యాహ్నం 1 గంట వరకే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 7న రాత్రి 9.50 గంటల నుంచి మధ్యాహ్నం 1.31 గంటల వరకు చంద్రగ్రహణం ఉందన్నారు. దీంతో ఆ రోజు ఉదయం 10 గంటల వరకే వ్రత, కేశఖండన టికెట్లు విక్రయిస్తామన్నారు. మధ్యాహ్నం 1 గంటకు దర్శనాలు నిలిపివేసి, ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు.
కృష్ణా: పెనమలూరులోని ఓ కాలేజీలో సోమవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ ఆర్. గంగాధరరావు మాట్లాడుతూ.. విద్యార్థులు స్మార్ట్ వర్క్తో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని, అలాగే ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
TPT: మోసపూరితంగా వ్యవహరించి వేరే అకౌంట్ నుంచి రూ.40 వేలు డ్రా చేసిన ఘటనలో మునిసుబ్రహ్మణ్యం (40)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పుత్తూరు DSP రవికుమార్ ఆధ్వర్యంలో ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బీటెక్ వరకు చదువుకున్నట్లు గుర్తించామని, అతడిపై గాజులమండ్యం, శ్రీకాళహస్తి, వడమాలపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్సై రామస్వామి తెలిపారు.
KRNL: దేవనకొండ మండలంలో నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE రవీంద్ర ఇవాళ తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించేందుకు 5 Amps నియంత్రిక స్థానంలో 8 Amps నియంత్రికను మార్చే పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
GNTR: సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య రంగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య సదుపాయాల మెరుగుదల, ఆరోగ్య బీమా విస్తరణ, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ప్రజలకు ఉచిత వైద్య పరీక్షల అందుబాటు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ప్రతి మండలంలో జనరిక్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య: ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 28 నుంచి సంబంధిత జిల్లాల్లోనే ప్రారంభమవుతుందని మెగా డీఎస్సీ – 2025 కన్వీనర్ MV. కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా ఇవాళ మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
కడప: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం 190 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ జరిగింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరియైన సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగం వస్తుందని స్పష్టం చేశారు.
ATP: పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద వినాయక మండపానికి డెకరేషన్ లైట్స్ ఏర్పాటు చేస్తుండగా పసుపులేటి రాజేశ్ అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తాడిపత్రిలో ఇంటర్ చదువుతున్న రాజేశ్ పండగ కోసం ఇంటికి వచ్చిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
VZM: ఇటీవల సాలూరు పట్టణం PS పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 13 మందికి ఒక్కోక్కరికి 10వేలు చొప్పున రూ.1.30 లక్షలు జరిమానా విధించినట్లు సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు సోమవారం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పట్టుబడిన 13 మందిని సాలూరు కోర్టులో హాజరుపరచగా జ్యాడీషియల్ మేజిస్ట్రేట్ ఒక్కరికి రూ.10 వేలు జరిమానా విధించారన్నారు.