KDP: ఎర్రగుంట్ల మండలం నిడిజీవి సమీపంలో సోమవారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న కారు రోడ్డు పక్కన ఆగింది. చిలమకూరు నుంచి ఎర్రగుంట్లకు వెళ్తున్న ఆటో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో చిలుమకూరుకు చెందిన ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. దీంతో ముద్దనూరు 108 వాహన సిబ్బంది ప్రొద్దుటూరు హాస్పిటల్కు తరలించారు.